అధికార తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ నుంచి వలసలు ప్రారంభమయ్యాయంటే కేసులో, ప్రలోభాలో, ఒత్తిడో అనుకోవచ్చు.. కానీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వారు కూడా వైసీపీలోకి మారుతున్నారంటే దానికి కారణం ఒకటే.. అధికారం కోసం మాత్రమే రాజకీయాలు చేసే ఆపార్టీ అధినాయకుడిని భరించలేక అంటే ఆ అధినేత క్యారెక్టర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అతనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఎన్నికలు దగ్గరపడుతుంటే చంద్రబాబుకు షాక్‌ల మీద షాక్‌లు తలుగుతున్నాయి. ఇప్పటికే టీడీపీ పై తీవ్రమైన వ్యతిరేకత రావడం, మరోవైపు ప్రస్తుత సర్వేలన్నీ వైసీపీకి అనుకూలంగా వస్తుండడంతో చంద్రబాబు టిక్కెట్ ఇస్తానని చెప్పి, ప్రలోభాలు పెట్టి పార్టీలోకి చేర్చుకోవడంతో టీడీపీ తమ్ముళ్ళు మెల్లగా జారుకుంటున్నారు.
టీడీపీలో జరుగున్న అంతర్గత వ్యవహారాల వల్ల కూడా అవమానాలు పడడం ఇష్టం లేక మరికొందరు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇన్నేళ్ళూ ఎలాగో చంద్రబాబు మార్క్ కుట్ర రాజకీయాలు, అబద్ధపు రాజకీయాలను భరించాం.. ఇక ఇప్పుడీ పార్టీలో ఉండే ప్రసక్తే లేదు అంటూ పార్టీని వీడడానికి రెడీ అవుతూ ఉన్నారు. కడప టీడీపీ ఎమ్మెల్యే పార్టీని వీడిన రోజుల వ్యవధిలోనే ఇప్పుడు కర్నూలు ఎమ్మెల్యే కూడా రెడీ అయిపోయాడు. తెలుగుదేశం పార్టీలో కనీస స్థాయి గౌరవం లేకపోవడంతో పాటు ప్రజల్లో టీడీపీ పట్ల, బాబు పాలన పట్ల ఉన్న వ్యతిరేకతను కూడా పరిగణనలోకి తీసుకున్న కర్నూలు ఎమ్మెల్యే టిడిపిని వీడడానికి రెడీ అయ్యారు. తన బంధువు అయిన భూమానాగిరెడ్డి టీడీపీలో చేరడంతో తప్పని పరిస్థితుల్లో అప్పట్లో టిడిపిలో చేరిన ఎస్వీ మోహన్‌రెడ్డి ఇప్పుడు తిరిగి సొంత గూటికి చేరుతున్నారు.
భూమా అఖిలప్రియ కూడా ఎస్వీ మోహన్‌రెడ్డిని వైకాపాలోకి వెళ్ళే దిశగా ప్రోత్సహిస్తున్నారనేది అసలు ట్విస్ట్.. చంద్రబాబును నమ్ముకుని పూర్తిగా భూమా కుటుంబానికి రాజకీయ అస్థిత్వం లేకుండా చేస్తారని అందుకే వైకాపాలోనే రాజకీయ భవిష్యత్ వెతుక్కోవాలని భూమా కుటుంబ సభ్యులు సీరియస్‌గా చర్చించుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకుని చంద్రబాబు కూడా ఎస్వీ మోహన్‌రెడ్డితో ఫోన్‌లో చర్చలు జరిపారట. అయితే ఒక వైపు టీజీ వెంకటేష్‌కి టికెట్ ఖాయం అని చెప్తూ మరోవైపు తనను మాత్రం మాటలతో బుజ్జగిస్తానంటే ఎలా అని ఎస్వీ మోహన్‌రెడ్డి డైరెక్ట్ గా చంద్రబాబుపైనే ఆరోపణలు చేస్తున్నారు. ప్రజాబలంలేని చంద్రబాబుకంటే ప్రజాబలం ఉన్న జగన్, అన్నింటికీ మించి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వైఎస్ జగన్ వైపు ఉంటేనే రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని వెంటనే జగన్‌కి క్షమాపణలు చెప్పి మళ్ళీ ఫిరాయింపు రాజకీయాలు చెయ్యను అని చెప్పి మనస్ఫూర్తిగా వైకాపాలో చేరే ప్రయత్నంలో ఉన్నారు ఎస్వీ మోహన్ రెడ్డి.. ఈ సమీకరణాలతో కర్నూలు రాజకీయం మరోసారి వేడెక్కనుంది.