వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర తర్వాత గత కొన్నిరోజులుగా హైదరాబాద్ నగరంలోని తన నివాసంలోనే ఉంటున్నసంగతి తెలిసిందే.అయితే ఎన్నికలు సమీపిస్తున్నవేళ జగన్ మోహన్ రెడ్డి ఇక మొత్తంగా ఏపీలోనే ఉండనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ఆయన ఇక నుంచి మొత్తం ప్రజల్లోనే ఉండేలా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా ‘సమర శంఖారావం’ పేరుతో జగన్ జిల్లాల వారీగా బూత్ లెవల్ కమిటీలతో ఆయన సమావేశాలు నిర్వహించనున్నారు. వచ్చే నెల ( ఫిబ్రవరి ) 4, 5, 6 తేదీల్లో అనంతపురం, కడప, తిరుపతిలో ఈ సమావేశాలు జరుగనున్నాయి. ఆ తర్వాత మిగతా జిల్లాల్లోనూ జగన్ బూత్ కమిటీలను నేరుగా కలిసి మాట్లాడనున్నారు. అయితే ఈ సమావేశాలు పూర్తయ్యాక రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.