వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో ఎన్టీఆర్ పెద్ద అల్లుడు,సీనియర్ నాయకుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు హైదరాబాద్‌లోని జగన్ నివాసంమైన లోటస్‌పాండ్‌లో భేటీ అయ్యారు.గత కొంతకాలంగా దగ్గుబాటి కుటుంబం.. వైసీపీలో చేరే అవకాశం ఉందని మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్‌తో దగ్గుబాటి సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తన కుమారుడు హితేష్‌తో కలిసి జగన్ నివాసానికి చేరుకున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి సాదర స్వాగతం పలికారు.ప్రస్తుతం దగ్గుబాటి వెంకటేశ్వరావు భార్య పురందేశ్వరి బీజేపీ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఫిబ్రవరి రెండో వారంలో జగన్ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు.ఈ పర్యటనలోనే జగన్ సమక్షంలో దగ్గుబాటి ఫ్యామిలి వైసీపీలో చేరుతునట్లు సమాచారం.అయితే దగ్గుబాటి కుటుంబం.. వైసీపీలో చేరుతారని దరువు ముందే చెప్పింది.
పరుచూరు మాజీ శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర రావు, కుమారుడు దగ్గుబాటి హితేష్ లతో వైయస్ జగన్ భేటీ.#APNeedsYSJagan pic.twitter.com/MTniBg8M77
— YSR Congress Party (@YSRCParty) January 27, 2019