హైదరాబాద్ నగరంలోని లోటస్పాండ్లో ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో సినియర్ నాయకుడు, పరుచూరు మాజీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర రావు, ఆయన కుమారుడు దగ్గుబాటి హితేష్ భేటీ ఐన సంగతి తెలిసిందే.అయితే భేటీ అనంతరం దగ్గుబాటి వెంకటేశ్వర రావు మీడియాతో మాట్లాడుతూ..జగన్ మోహన్ రెడ్డి పై ప్రశంసలు జల్లు కురుపించారు.గత రెండు సంవత్సరాలుగా తాము జగన్ని గమనిస్తూనే ఉన్నామని అన్నారు . జగన్ పార్టీని నడుపుతోన్న తీరు అత్యంత ప్రశంసనీయమని ఆయన కొనియాడారు. గిట్టని వారు ఎన్ని మాటలు మాట్లాడినా, ఈసారి జగన్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తారని, ఆయన కష్టానికి తగిన ఫలితం దక్కుతుందని దగ్గుబాటి ధీమా వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే పురంధ్రీశ్వరి గురించి విలేకరులు ప్రశ్నించగా.. ఆమె బీజేపీలోనే కొనసాగుతారని స్పష్టం చేశారు. అవసరమైతే పురంధ్రీశ్వరి రాజకీయాల నుంచి తప్పుకుంటారని తెలిపారు.అయితే రానున్న ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గం నుంచి దగ్గుబాటి వెంకటేశ్వర రావు తనయుడు దగ్గుబాటి హితేష్ చెంచురాం పోటీ చేయి౦చేందుకు జగన్ హామీ ఇచ్చారని ప్రచారం జోరుగా జరుగుతుంది.