70వ భారత గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ప్రభుత్వం, ప్రజలు ఘనంగా నిర్వహించారు. భారతదేశంతో పాటు ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరు ఘనంగా గణతంత్ర వేడుకలు నిర్వహించినట్లు తెలుస్తుంది. ఇందులో బాగంగానే 70వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు సౌత్ ఆఫ్రికాలో ఘనంగా జరిగాయి. భారత కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో జొహన్నెస్‌బర్గ్‌లో గణతంత్ర వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో టీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ సభ్యులు పాల్గొని భారత జాతీయ జెండా ఎగురవేశారు. టీఆర్ఎస్ ఎన్నారై అధ్యక్షుడు గుర్రల నాగరాజు , కెజే శ్రీనివాస్ , కిరణ్ బెల్లీ, హర్సీజీ తన్నీరు, కుశల్ దేశాయ్, ప్రవీణ్ కూమారు, జోన్నలగడ్డ దీపిక, నవదీప్ రెడ్డి, రాజశేఖర్ మరియు పడల సురేష్ లు పాల్గొన్నారు. ఇక భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామపోసా చీఫ్ గెస్ట్‌గా భారత్‌కు వచ్చారు. ఆయన ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు.