గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సారథ్యంలో రాజ్‌భవన్‌లో జరగనున్న ఎట్ హోం కార్యక్రమంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఏపీ, తెలంగాణ నేతలు ఈ పార్టీకి హాజరుకాగా.. రాజకీయ చర్చలకు కూడా ఎట్ హోం కార్యక్రమం వేదికైంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్య ఆసక్తికరమైన చర్చలు జరిగాయి. ఈ ఎపిసోడ్‌పై పచ్చమీడియా పరేషాన్ అవుతోంది.
ఓవైపు కేసీఆర్, కేటీఆర్ మధ్య ముచ్చట్లు… ఆ వెంటనే పవన్ కల్యాణ్, కేసీఆర్ మధ్య చర్చలు జరిగాయని టీడీపీ అనుకూల ఛానల్లు హోరెత్తించాయి. ఏపీలోని రాజకీయ పరిస్థితులపై గులాబీ దళపతి, జనసేనాని మధ్య చర్చలు కొనసాగాయని పేర్కొన్నాయి. ఈ సమయంలో కేటీఆర్ కూడా పక్కనే కూర్చున్నారని సన్నాయి నొక్కులు నొక్కింది. ఈ సందర్భంగా ఫెడరల్ ఫ్రంట్‌లో వైఎస్ జగన్‌పై కూడా చర్చ జరిగినట్టు తెలుస్తోందంటూ సొంత విశ్లేషణలు చేసింది.