ప్రతి జిల్లా నుంచి ఒకరిద్దరి సిట్టింగులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నో చెప్పే సూచనలే ఎక్కువగా కన్పిస్తున్నాయనే సమచారం. అయితే వారు అధినేత నిర్ణయాన్ని ఏ మేరకు అంగీకరిస్తారు..? పార్టీకి వ్యతిరేకంగా ఏమైనా చేస్తారా..? కొత్త అభ్యర్థులు అసంతృప్త సిట్టింగ్‌లను ఎలా ఎదుర్కొంటారు? వంటి అంశాలపై పార్టీలో చర్చ సాగుతోంది. అందుకే తొలుత ఎలాంటి ఇబ్బందులు లేని స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అతి ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటం తో చంద్ర బాబు సర్వేలు , ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఒకటి కి పది సార్లు తెప్పించుకొని వారి నియోజకవర్గాల్లో టీడీపీ నుండి గెలుస్తారా లేదా అని అభ్యర్థులను అంచనా వేస్తున్నాడు. అయితే దీంతోపాటు.. కొన్ని ఇంటెజిజెన్స్ సర్వేలు – సీక్వెల్ సర్వేలు కూడా వ్యక్తిగతంగా తెప్పించుకుంటారు. రాబోయే ఎన్నికల్లో సిట్టింగులకు సీట్లు ఇవ్వాలా వద్దా డైలామాలో పడ్డరంటా. చంద్రబాబు దగ్గరున్న ఇంటిలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం.. చాలా నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థుల పరిస్థితి చాలా ఘరోంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికితోడు.. చంద్రబాబు సొంతంగా చేసుకున్న సర్వే ఫలితాలు కూడా ఇంచుమించుగా ఇదే విధంగా ఉన్నాయని సమాచారం. దీంతో.. ఎన్నికలు అంటేనే చంద్రబాబు భయపడిపోతున్నారట. అందుకే ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా సమావేశం అవుతున్నారు. ఒక్క రోజే దాదాపు 15 మంది ఎమ్మెల్యేలతో చంద్రాబాబు మాట్లాడారు. ఈ 15 మందికి వచ్చే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ వచ్చే అవకాశాలే లేవని సమాచారం. మరి వారికి టిక్కెట్ ఇవ్వకుంటే వైసీపీలోకి చేరే టిక్కెట్ ఇవ్వకపోయిన వైసీపీని గెలిపించడం కోసం కృషి చెయ్యాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది.