ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. జనవరి 26వ తేదీ శనివారం టీడీపీ ఎంపీలతో బాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీలకు బాబు ఈమేరకు సిగ్నల్స్ ఇచ్చారు. పార్లమెంట్ సమావేశాల చివరి రోజు నిరసన చేయాలని అనుకుంటున్నట్లు…అయితే..ఎలాంటి నిరసన చేయాలో మీరే చెప్పాలంటూ పార్టీ ఎంపీలను బాబు అడిగారు.
తెలుగు ప్రజలకు న్యాయం చేయాలని గతంలో కూడా దీక్ష చేసిన సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈసారి మాత్రం దీక్ష లేదా నిరసన చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు బాబు ఎంపీలతో తెలిపారు. ప్రస్తుతం ఎలాంటి నిరసన వ్యక్తం చేయాలో చెప్పాలన్నారు. ఎప్పటికప్పుడు సమయస్పూర్తితో నిర్ణయాలు తీసుకోవాలని..పార్లమెంట్లో ఆందోళన చేస్తే సస్పెండ్ కాకుండా జాగ్రత్తగా మసలుకోవాలని బాబు ఎంపీలకు సూచించారు