పాలెగాళ్ల పురుటిగడ్డ అయిన పత్తికొండలో సైకిల్ మళ్లీ రివ్వున దూసుకుపోతుందా? లేక ఫ్యాన్ గాలి వీస్తుందా? అనే చర్చ మొదలైంది. ఈ నియోజకవర్గంలో కేఈ కుటుంబం 2009, 2014 ఎన్నికల్లో పోటీ చేసి.. రెండు సార్లూ విజయం సాధించింది. 2014 ఎన్నికల్లో కేఈ కృష్ణమూర్తి విజయం సాధించి.. డిప్యూటీ సీఎం అయ్యారు. కేఈ కుటుంబానికి కంచుకోటైన పత్తికొండ నుంచి వచ్చే ఎన్నికల్లో తన తనయుడు శ్యాంబాబును బరిలోకి దించాలని కృష్ణమూర్తి నిర్ణయించారు. ఇప్పటికే కార్యకర్తలతో చర్చలు జరిపి శ్యాంబాబు గెలుపునకు కృషి చేయాలని కోరారు.
ఇకపోతే వచ్చే ఎన్నికల్లో పత్తికొండ అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా చెరుకులపాడు శ్రీదేవి బరిలో దించుతామాని పాదయాత్రలో బాగంగా క్రిష్ణగిరిలో వైఎస్ జగన్ శ్రేదేవిను అభ్యర్థిగా ప్రకటించారు. రాష్ట్రంలోనే తొలి అభ్యర్థిగా శ్రీదేవి ఎంపిక జరిగింది. ఎన్నికలకు ఏడాదిన్నర ముందే అభ్యర్థిని ప్రకటించడంతో కర్నూల్ జిల్లాలో రాజకీయ వేడికి తెర లేచింది. ఈసారి ఎలాగైనా సైకిల్ జోరుకు బ్రేకులు వేయా లనే పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె నియోజకవర్గంలో ఊరూరా పర్యటిస్తూ ప్రజలకు దగ్గరవుతున్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో శ్రీదేవి వైసీపీ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలబోతుందని తెలుస్తుంది. అయితే వైసీపీ నేత చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో శ్యాంబాబు ఆరోపణలు ఎదుర్కొంటుండటం కొద్దిగా మైనస్‌గా మా రింది. మరోవైపు తుగ్గలిలో రాష్ట్ర శాలివాహన ఛైర్మన్ తుగ్గలి నాగేంద్రతో కేఈ కుటుంబానికి విభేదాలు తారస్థాయికి చే రాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో శ్యాంబాబు గెలవడని స్థానికులు చెబుతున్నారు .