Home / 18+ / నేను మీ చంద్రబాబును మాట్లాడుతున్నా అంటూ మీకు ఫోన్లు వస్తున్నాయా మీ ఓటు ఉందో లేదో చూసుకోండి..

నేను మీ చంద్రబాబును మాట్లాడుతున్నా అంటూ మీకు ఫోన్లు వస్తున్నాయా మీ ఓటు ఉందో లేదో చూసుకోండి..

మరోసారి అధికారంలోకి రావడానికి టీడీపీ అన్నిరకాల అడ్డదారులు తొక్కుతోంది.. ఓ వైపు పథకాల పేరుతో ఎరవేస్తూ మరోవైపు తమకు వ్యతిరేకులుగా గుర్తించి వారి పేర్లను ఓటర్ల జాబితానుంచి నిర్దాక్షిణ్యంగా తొలగించేస్తోంది. సర్వేల పేరుతో గ్రామాల్లోకి యువతను పంపి కాల్‌ సెంటర్‌నుంచి ఫోన్లు చేసి వారి అభిప్రాయాన్ని తెలుసుకుని వారి ఓట్లను గల్లంతు చేస్తోంది. ఇటీవల నమస్కారం. నేను చంద్రబాబు నాయుడిని మాట్లాడుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వ పాలనపై మీరు సంతృప్తికరంగా ఉన్నారా?. ఉన్నామంటే ఒకటి, ఫర్యాలేదంటే రెండు నొక్కండి, చాలా బాగుందంటే మూడు నొక్కండి, అసలేం బాగోలేదంటే నాలుగు నొక్కండి’… అంటూ మీకు ఫోన్‌ చేసి అడుగుతున్నారా.! అలాగే మేం ఒక సంస్థ నుంచి వచ్చాం.

రాష్ట్ర రాజకీయాలపై సర్వే చేస్తున్నాం. మేం అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. చంద్రబాబు, జగన్, పవన్‌కల్యాణ్‌.. ఈ ముగ్గురిలో వచ్చే ఎన్నికల్లో ఎవరు సీఎం ఐతే బాగుంటుంది అనుకుంటున్నారు. అంటూ మీ వద్దకు వచ్చి ఎవరైనా ఆరాతీస్తున్నారు.. ఈ రెండింటికీ సమాధానం చెప్పాక వారడిగిన ప్రశ్నలకు మీరిచ్చిన సమాధానం టీడీపీకి వ్యతిరేకంగా వెంటనే ఓటు తీసేస్తున్నారు. దీనికి ఆధారాలు కూడా బయటపడ్డాయి. పూసపాటిరేగ మండలంలోని కుమిలి గ్రామంలో ఎన్నికల రాజకీయ సర్వే పేరిట ఓటర్ల జాబితాతో కూడిన ట్యాబ్‌లను తీసుకుని సర్వే చేస్తున్న వ్యక్తులను వైసీపీ నేతలు గుర్తించారు. గజపతినగరానికి చెందిన గొల్లు కృష్ణ, గొల్లు దేముడుబాబు, తొత్తిడి దేముడు అనే యువకులు గ్రామంలో గురువారం సర్వే ప్రారంభించారు.

ఆ గ్రామానికి సంబంధించిన ఓటర్ల జాబితా ట్యాబ్‌లో వుండటంతో పాటు అధికారపార్టీకి అనుకూలంగా ప్రశ్నలు చేయడంతో అక్కడే ఉన్న వైసీపీ నాయకులు మహంతి శ్రీనివాసరావు, గుజ్జు సురేష్‌రెడ్డి, పార్టీ కార్యకర్తలకు అనుమానం వచ్చింది. పూసపాటిరేగలో ప్రతిపక్షానికి చెందిన సుమారు 140 ఓట్ల వరకు ఫారం–7 ఇవ్వకుండానే తొలగింపుల జాబితాలో కనిపిస్తున్నాయి. వీరంతా సీఎం చంద్రబాబు నుంచి వచ్చిన వాయిస్‌ మెసేజీల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమాధానమిచ్చినవారని భావిస్తున్నారు. ఇదేమిటని తహసీల్దార్‌ జి.సూర్యలక్ష్మిని అడిగితే అమె తనకేమీ తెలియదన్నట్లు సమాధానమిస్తున్నారు. ఈ నేపధ్యంలో కుమిలిలో ఓటర్ల జాబితా సహా సర్వే జరుగుతుండటంతో తొలిగింపు ప్రక్రియలో భాగంగానే సర్వే జరుగుతోందనే అనుమానాలకు బలం చేకూరింది.

వారిని అదుపులోకి తీసుకున్న పూసపాటిరేగ ఎస్‌ఐ వి.బాలాజీరావు వారిని తూతూ మంత్రంగా విచారించి వదిలేశారు. వారిపై కేసు నమోదు చేయాలని నాయకులు కోరగా సర్వే చేయడం నేరం కాదంటూ తోసిపుచ్చారు. ఘటనపై వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించిన మీడియాను పోలీస్‌ స్టేషన్‌ లోపలికి కూడా రానివ్వకుండా గేట్లు మూసేశారు. విషయం తెలుసుకున్న పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రం గా స్పందించారు. వెంటనే రాష్ట్ర ఎన్నికల కమిషన్, డీజీపీ కార్యాలయం అధికారులతో మాట్లాడారు. పలువురు పార్టీ నేతలతో పాటు వెళ్లి శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను, రాష్ట్ర డీజీపీని కలవాలని నిర్ణయించారు. నిబంధనలకు విరుద్ధంగా ఓటరు లిస్టులను ట్యాబ్‌లలో ఉంచి, సర్వేలు చేస్తున్న వారిపైనా, వారి వెనకుండి ఈ పని చేయిస్తున్న వారిపైనా ఫిర్యాదు చేయనున్నారుఅవసరమైతే జాతీయ ఎన్నికల కమిషన్‌ను కూడా కలిసి ఈ అంశంపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడుతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat