తాజాగా వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో తన తండ్రిని చంపిన పార్టీలోకి ఎలా వెళ్తారంటూ రంగా అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తూ రాసిన లేఖ వైరల్ అవుతోంది.. ఆ లేఖ యధాతధంగా..
చేతగాక పగతీర్చుకోలేకపోయినా పర్వాలేదు.. కానీ పగోడి చెంతకే చేరావు చూడూ.. శత్రువుకి నిజమైన విజయం ఇదే..
నువ్విలా తయారవుతావని తెలిసి ఉంటే మీ నాయన చిన్నప్పుడే నిన్ను నులిమేసేవాడు..జీవితంలో భయంకరమైన తప్పు చేస్తున్నావ్.. ఈతప్పుకు జీవితాంతం పశ్చత్తాపపడతావు.. ఇది ఎప్పటికీ చెరిగిపోని మచ్చ. ఇది నీ కుటుంబానికే కాదు, మీ నాయనని అభిమానించే అందరికీ జీవితాంతం వెంటాడే విషాదకర నిర్ణయం.బాగా ఆలోచించుకో మీ నాయనతో నీకేమైనా జ్ఞాపకాలు ఉంటే వాటిని నెమరేసుకో.. మీనాయనతో తిరిగిన ఆనాటి దోస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా ఆఖరిసారి మాట్లాడే ప్రయత్నం చెయ్.. పదవులు ఈరోజు రావొచ్చు.. పోవచ్చు జీవితంలో పడే మచ్చలు ఎప్పటికీ చెరిగిపోవు చూసావా రాధా.. మీ నాయన లేకపోయినా..
ఆయన మొహం మీద పడిన గొడ్డలిగాట్లు ముప్పైఏళ్ళ అయినా అలానే ఉన్నాయి.. ప్రాణం పోయే ముందు ఆయనకి నువ్వే గుర్తొచ్చి ఉంటావుతప్పు సరిదిద్దుకోవటానికి నీకు ఇంకా అవకాశం ఉంది.. ఆలోచించుకో జగన్ మోహన్ రెడ్డి గారు ఒక మహోన్నత లక్ష్యం కోసం సర్వ సుఖాలను త్యాగం చేసుకున్న వ్యక్తి. నువ్వు సుఖానికి అలవాటుపడ్డావ్.. సోమరిపోతులు, ఇంద్రియాలను నిగ్రహించుకోలేని బలహీనులు, బుద్ధినికోల్పోయి అధోగతి పాలైన వారు జగన్ గారి పై విమర్శలు చేస్తే ఆయనకు పోయేదేంలేదు.సూర్యుని పై బుద్ధిహీనుడు ఉమ్మివేస్తే ఆ ఉమ్ము ఆ బుద్ధిహీనుని ముఖం మీదే పడుతుంది. రాధా లాంటి బుద్ధిహీనుడి విమర్శలూ అటువంటివే.
రంగా గారి లక్షణాలు నిత్యం పేదల మధ్యనే ఉండడం, నిరాహార దీక్షలతో ప్రభుత్వాన్ని నిలదీయడం, వేలు లక్షలకొద్దీ ప్రజలను తన సభలకు ఆకర్షించడం, మేలుకోరివచ్చినవాడికి సహాయం చేయడం, ప్రాణం పోతుందని తెలిసినా విలువలు కోల్పోకపోవడం, శత్రువు అతి బలవంతుడైనా కూడా వెన్నుచూపకుండా ఢీకొట్టడం..ఈ లక్షణాలన్నీ జగన్ గారిలో గత 10ఏళ్లుగా రాష్ట్ర ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. చివరిగా జగన్మోహన్ రెడ్డి రూపంలో వంగవీటి మోహన రంగా ఇంకా బ్రతికే ఉన్నారు.