టీమిండియా ఈ కొత్త సంవత్సరంలో మెరుగైన ప్రదర్శన కనపరుస్తూ విజయాల పరంపర కొనసాగిస్తుంది.ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ విజయంతో చరిత్ర సృష్టించిన విషయం అందరికి తెలిసిందే.ఆ తరువాత 50ఓవర్ల ఫార్మాట్ లో కూడా విజయం సాధించింది.ఇందులో ధోని కీలక పాత్ర పోషించాడు.వరుసగా మూడు అర్ధ శతకాలు నమోదు చేసి ఈ ఏడాది జరగనున్న ప్రపంచ కప్ కి ఫిట్ అని నిరూపించుకున్నాడు మాజీ కెప్టెన్ ధోని.
అయితే ఇప్పుడు ప్రస్తుతం మన వాళ్ళు బ్లాక్ కాప్స్ తో ఆడుతున్న సిరీస్ లో ఇప్పటికే సునాయాసంగా ఒక మ్యాచ్ గెలిచేసారు.తాజాగా మన బోర్డు చివరి రెండు మ్యాచ్ లు మరియు టీ20 సిరీస్ కు కోహ్లిని దూరం పెట్టింది.వరుసగా విరామం లేకుండా ఆడడంతో ప్రపంచ కప్ దృష్టిలో పెట్టుకొని విశ్రాంతి ఇచ్చారు.అయితే ఇప్పుడు కెప్టెన్ భాద్యతలు రోహిత్ కు అప్పగించారు.ఇప్పుడు రోహిత్ ఇంకా బాగా ఆడే అవకాశం ఉంది..ఎందుకంటే ఒకపక్క కెప్టెన్ గా మరో పక్క ధోని సపోర్ట్ ఉంటుందని కొందరి క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం.