కర్నూల్ జిల్లాలో రాజకీయం వేడెక్కుతుంది. గత నాలుగు సంవత్సరాలనుండి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పాలన అత్యంతా దారుణంగా ఉందని రాజకీయ నాయకులే కాక.. సామాన్య ప్రజలు కూడ చెబుతున్నారు. చంద్రబబాబు నాయుడు అధికారంలోకి రావడం కోసం అమలు చెయలేని 600 హామీలిచ్చి ఏపీ ప్రజలను దారుణంగా మోసం చేశారని వైసీపీ నేతలు అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధికార పార్టీ అయిన టీడీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతీరేకత ఉండడంతో అన్ని పార్టీల నేతలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసలు పెరుగుతున్నాయి. తాజాగా జిల్లా లో వైసీపీ బలం మరింత బలపడింది. మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి గారి సొంత తమ్ముడు హర్షవర్ధన్ రెడ్డి వైసీపీలో చేరుతున్నట్లు సమచారం. వచ్చే నెల అనగా ఫీబ్రవరి 6 న కోట్ల హర్షవర్ధన్ రెడ్డి వైసీపీ చేరుతున్నట్లు తెలుస్తుంది. జిల్లాలోని పత్తికొండ, కొడుమూరు నియోజకవర్గంలో పోటి చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు మద్దతు తెలుపుతూ పార్టీ లో జాయిన్ అవుతున్న తెలుస్తుంది. అయితే ఎమ్మెల్సీ గా అవకాశం ఉంటుంది అని జగన్ హామి ఇచ్చినట్లు వార్తుల వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుందని..అందుకే వైసీపీలోకి చేరుతున్నానని హర్షవర్ధన్ రెడ్డి తన అనుచరులతో చెప్పినట్లు సమచారం. ఏదీ ఏమైన ఏపీలో జగన్ జోరు సైకిల్ బే ‘జారు’ !!! వైసీపీ లోకి టీడీపీ విప్ మరియు టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి , మంత్రి సోమిరెడ్డి సొంత బావ రామకోటారెడ్డి , మరియు కాంగ్రెస్ మాజీ ఎంపీ కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి తమ్ముడు కోట్ల హర్ష వర్ధన్ రెడ్డి , …ఇంకా క్యూలో చాల మంది ఉన్నారు .జగన్ ఒప్పుకొంటే చేరడానికి 25 మంది టీడీపీ ఎమ్మెల్యే లు ఒక అరడజను మంది మంత్రులు రెడీగా ఉన్నారంట .ఫ్యాన్ గాలి చూసి అంతా ఫ్యాన్ క్రింద సేద తీరాలని చూస్తున్నారు.