సీఎం చంద్రబాబు ట్రాప్‌లో వంగవీటి రాధా పడటం అత్యంత బాధాకరమని వైసీపీ నేత పేర్నినాని అన్నారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన నాని పేదలకు ఇళ్లు మంజూరుచేయడమే రంగా ఆశయం కాదని ప్రతిపేదవాడి కష్టంలో అండగా ఉండటమే రంగా ఆశయమన్నారు. అధికారం అంతమయేరోజుల్లో పేదలకు చంద్రబాబు ఇళ్లు ఇస్తారని రాధా నమ్మడం కరెక్ట్ కాదన్నారు. సింహం కడుపున పుట్టిన రాధా నరరూప ఆలోచనలు కలిగిన చంద్రబాబు ట్రాప్‌లో చిక్కుకోవడం నక్కకు కుదేలు దొరికిన విధంగా ఉందన్నారు. రంగా నూటికి నూరుపాళ్లు రాజకీయాలకు అతీతుడని, ఆయన యశస్సు రాజకీయాల కంటే ఉన్నతమైందన్నారు.
రాధకు రంగా విగ్రహవిష్కరణకు వెళ్లడానికి ఏరోజూ పార్టీ అధినేత జగన్ అడ్డు చెప్పలేదని, ఎక్కడకెళ్లినా పార్టీ కేడర్‌ను కలవమని మాత్రమే చెప్పారన్నారు. రాధాకు వైసీపీ సముచిత స్థానం కల్పించిందన్నారు. జగన్‌పై వంగవీటి వ్యాఖ్యలు సత్యదూరమన్నారు. రంగా హత్యకు, టీడీపీకి సంబంధంలేదని, ఆరోజు ఆవేశంగా మాట్లాడనని రంగా వ్యాఖ్యనించడం లక్షలాది రంగా అభిమానులు ఆవేదన చెందుతున్నారన్నారు. రాధా ఇలా మాట్లాడటం మనసు కలచివేసిందన్నారు. వంగవీటి రంగాను టీడీపీయే హత్య చేయించిందని అందరికీ తెలుసన్నారు. టీడీపీ గుండాలు హత్యచేశారని రంగా అభిమానులు పాటలు కూడా పాడారని గుర్తుచేశారు. రాధ చంద్రబాబు ట్రాప్‌లో పడవద్దని, రంగా ఆశయాల నెరవేరుస్తారనే అమాయక స్థితిలోకి వెళ్లవద్దని రాధా ఎక్కడున్నా మంచి భవిష్యత్ ఉండాలన్నారు.