నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడలో వైశ్యకులానికి చెందిన అమృత, దళితుడైన ప్రయణ్ కుమార్ కులహత్య రాష్ట్రవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. ప్రయణ్ కుమార్ పై హత్య జరిగినప్పటి నుంచి అమృత అత్తింట్లోనే ఉంటోంది.అయితే హత్య సమయంలో ఐదు నెలల గర్భిణి అయిన అమృత..ఇవాళ పండంటి మగబిడ్డకు జన్మనించింది.ఈ రోజు మిర్యాలగూడ ఆస్పత్రిలో ఆమె డెలివరీ అయిందని, తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని ప్రయణ్ కుమార్ కుటుంబసభ్యులు తెలిపారు. ప్రణయే మళ్లీ పుట్టాడని, బిడ్డను కోల్పోయిన తమకు ఈ పిల్లాడి రాకతో కొండంత ఆశ, ధైర్యం వచ్చాయని వారు పేర్కొన్నారు.
