తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్ ఆలీకి చాలా మంచి పేరుంది.అలాగే చెడ్డ పేరు కూడా ఉంది.తన డబుల్ మీనింగ్ డైలాగులతో చాలసార్లు చిక్కుల్లో పడ్డాడు కూడా. గతంలో సుమ, సమంత, అనుష్కలపై నోరు జారిన ఆలీ విమర్శల పాలైయ్యాడు.తాజాగా మరోసారి ఇదే రిపీట్ అయ్యింది.బుధవారం రాత్రి జరిగిన ‘లవర్స్ డే’ ఆడియో లాంచ్‌లో సుమ రాజీవ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు.అయితే హీరోయిన్ ప్రియా ప్రకాష్‌ను వేదిక మీదకు పిలిచిన సుమ తనని చెల్లెలుగా అభివర్ణించింది.
పక్కనే ఉన్న ఆలీ వెంటనే మైక్ తీసుకుని ప్రియా వారియర్ నీ చెల్లెలు అయితే హీరో రోషన్ మీ కొడుకా అని సుమని ప్రశ్నించాడు.దీనికి సుమ అవునని సమాధానం ఇవ్వగా.. వెంటనే ఆలీ రాజీవ్‌కు ఇంత పెద్ద కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడో… అని డబుల్ మీనింగ్ లో మాట్లాడాడు.ఈ విషయం ఇక్కడితో ఆపేయాలని సుమ వెంటనే టాపిక్‌ను మార్చేసింది.కాని ఈ విషయానికి రాజీవ్ ఎలాంటి సమాధానం ఇస్తాడో చూడాలి. ఇది ఎలా ఉండగా ఆలీ గతంలో కూడా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.కొన్ని మహిళ సంఘాలు ఆలీ ఇంటి ముందు అందోళన కూడా చెప్పట్టాయి.అయినప్పటికి ఆలీలో ఎటువంటి మార్పు రాలేదు.