రెబల్ స్టార్ కృష్ణంరాజుకు ఎట్టకేలకు బంపర్ ఆఫర్ తగిలినట్టే.మొదటి నుండి పార్టీని అంటిపెట్టుకుని నమ్మకంగా ఉన్న కృష్ణంరాజును సరైన సమయంలో, సరైన విధంగా వాడుకునే ఆలోచనలో వుంది బీజేపీ. ఏపీ గవర్నర్ గా కృష్ణంరాజు పేరును ఖరారు చేసే యోచనలో ఢిల్లీలో స్కెచ్ సిద్ధమైనట్లు సమాచారం.
గవర్నర్ నరసింహన్‌ని ఏ క్షణాన్నయినా మార్చవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్న సమయంలో.. కేంద్ర ప్రభుత్వం తాజాగా ముహూర్తం ఖరారు చేసిందట.ఏపీలో బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి కొత్త గవర్నర్ ని ప్రయోగించాలని మోదీ సర్కార్ భావిస్తునట్టు సమాచారం.తెలంగాణ గవర్నర్ బాధ్యతల్ని నరసింహన్‌కి వదిలేసి.. ఏపీకి మాత్రం కొత్త వ్యక్తిని ఎంపిక చేయాలనే ఆలోచనలో ఉన్న మాట వాస్తవమే.తెలుగు రాష్ట్రానికి తెలుగు వ్యక్తికి అవకాశం ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజును ఫైనల్ చేయనుందట కేంద్రం. ఈ నేపధ్యంలో ఆయనకు ఢిల్లీకి రమ్మంటూ పిలుపొచ్చిందని.. అయితే ఇక్కడే ఒక చిన్నమెలిక పెట్టిందట కేంద్రం.
ప్రస్తుతం తెలుగు సినీ చరిత్రలో ఒక వెలుగు వెలుగుతున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ని కూడా పార్టీలో చేరిస్తే.. ఆయనకు ఎమ్మెల్యే టిక్కెట్, నీకు గవర్నర్ పదవి ఇస్తామంటూ అమిత్ షా కృష్ణంరాజుకు ఆఫర్ చేశారట.అయితే ఈ అంశంపై కృష్ణంరాజు నుంచి క్లారిటీ ఇంక రాలేదని సమాచారం.ఒకవేళ గవర్నర్ పదవికి ఆయన ఓకే చెప్పినా, ఎమ్మెల్యే టిక్కెట్‌కి ప్రభాస్ ఒప్పుకునే ప్రశక్తే లేదు.బీజీపీ చేస్తున్నఈ ప్రయత్నాలు నిజమే అయితే..అమిత్ షా బుర్రకు జై కొట్టాల్సిందే.ఇప్పటికే బీజేపీ దేశవ్యాప్తంగా సెలబ్రిటీల వేటలో బిజీగా ఉంది.. ప్రభాస్ ఫాలోయింగ్‌ని పార్టీ కోసం వాడుకోవాలనే ఆలోచనలోఉన్నారంట.