సీఎం చంద్రబాబు కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు వర్తింపజేస్తాననడంలో దుర్మార్గపు, స్వార్థపరమైన ఆలోచన, కుట్ర దాగి ఉన్నాయని శాసనమండలిలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు నాయుడు మరోసారి కాపులను మోసం చేయడానికి చూస్తున్నారని అగ్రకులాల పేదలకు కేంద్రం ఇచ్చిన రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు కల్పించే అధికారం చంద్రబాబుకు లేదన్నారు.
రిజర్వేషన్ల పేరుతో కులాల మధ్య చిచ్చు పెట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.ఎన్నికల్లో లబ్ది పొందడం కోసం వాళ్ళ ఆశలపై నీళ్ళు జల్లుతున్నారని అన్నారు.మన రాష్ట్రంలో బంగారం, డబ్బులు దోచుకునే దొంగలు చూసి ఉంటాం..కాని ఇప్పుడు నవరత్నాల పథకాలను దొంగిలించిన దొంగగా చంద్రబాబు తయారయ్యారని వ్యాఖ్యానించారు.నాలుగేళ్ళుగా లేనిది ఎలక్షన్ సమీపిస్తున్న వేల గుర్తుకొచ్చాయా అని ప్రశ్నించారు.సీఎం చంద్రబాబు కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు వర్తింపజేస్తాననడంలో దుర్మార్గపు, స్వార్థపరమైన ఆలోచన, కుట్ర దాగి ఉన్నాయని శాసనమండలిలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు.
గుంటూరులోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు నాయుడు మరోసారి కాపులను మోసం చేయడానికి చూస్తున్నారని అగ్రకులాల పేదలకు కేంద్రం ఇచ్చిన రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు కల్పించే అధికారం చంద్రబాబుకు లేదన్నారు.రిజర్వేషన్ల పేరుతో కులాల మధ్య చిచ్చు పెట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.ఎన్నికల్లో లబ్ది పొందడం కోసం వాళ్ళ ఆశలపై నీళ్ళు జల్లుతున్నారని అన్నారు.మన రాష్ట్రంలో బంగారం, డబ్బులు దోచుకునే దొంగలు చూసి ఉంటాం..కాని ఇప్పుడు నవరత్నాల పథకాలను దొంగిలించిన దొంగగా చంద్రబాబు తయారయ్యారని వ్యాఖ్యానించారు.నాలుగేళ్ళుగా లేనిది ఎలక్షన్ సమీపిస్తున్న వేల గుర్తుకొచ్చాయా అని ప్రశ్నించారు.