కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా అయన నిరుద్యోగులకు ఓ శుభవార్త చెప్పారు . రానున్న రెండేళ్లలో రైల్వే శాఖలో 2.50 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు . మొదటి దశలో 1.31 లక్షల ఉద్యోగాలను, రెండో దశలో 99 వేల ఉద్యోగాలను భర్తీ చేయనునట్లు పేర్కొన్నారు. గత 14 నెలల క్రితం 1,51,548 పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించాం అని చెప్పారు.అయితే ప్రస్తుతం దానికి అదనంగా 2.50 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నాం అని… ఇందులో 103వ రాజ్యాంగ సవరణ ప్రకారం పేదలకు 10% కోటా కల్పిస్తాం అన్నారు . దీని ద్వారా 23 వేల మంది పేదలకు లబ్ధి జరుగుతుందని చెప్పారు.
