తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రజా నాయకుడు వంగవీటి మోహన హత్య ఓ సంచలనం. రంగా హత్య తర్వాత విజయవాడ హింసాకాండగా మారింది. దాదాపు 40 రోజుల పాటు అట్టుడికిపోయింది.. 1988 డిసెంబర్ 26వ తేదీన రంగా హత్యకు గురయ్యారు. అయ్యప్ప మాల వేసుకుని వచ్చిన దుండగులు నిరాహార దీక్షలో ఉన్న రంగాను కిరాతకంగా హత్య చేశారు. 1985 ఎన్నికల్లో జైలులో ఉండే రంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. హత్య జరిగిన వెంటనే బాధ్యత వహిస్తూ హోం మంత్రిగా కోడెల శివప్రసాద రావు రాజీనామా చేశారు. కాపు, కమ్మ సామాజిక వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థితిలో రంగా హత్య జరిగింది. రంగా హత్య జరిగిన తర్వాత చెలరేగిన అల్లర్లలో పెద్దయెత్తున ప్రాణనష్టం కూడా జరిగింది. వంద కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అల్లర్లు చెలరేగాయి.
ఎన్టీ రామారావు సోదరుడికి చెందిన సినిమాలను ధ్వంసం చేశారు కానీ రాజశేఖర రెడ్డికి చెందిన రెండు సినిమా థియేటర్లకు కూడా ఏమీ జరగలేదు. ఒక వర్గంవారి ఆస్తులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. ఇది వంగవీటి కుటుంబానికి తెలుగుదేశం పార్టీకి మధ్య ఉన్న వైరం.. సాక్ష్యాత్తూ చంద్రబాబే ఈ హత్య చేయించారని ప్రధాన పత్రికల్లోనూ వార్తలొచ్చాయి. కానీ ఆయన తనయుడు రాధా టీడీపీలో చేరుతున్నారు. వైసీపీకి రాజీనామా చేసిన రాధా టీడీపీలో చేరడం ఖాయమైంది. ఈ నెల 21న రాధా తన అనుచరులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాధా కూడా టీడీపీలోకి వెళ్లేందుకు సుముఖంగా ఉన్నట్టు అర్ధమవుతోంది. రాధా టీడీపీలోకి 25వ తేదీన టీడీపీలోకి వస్తారని సీఎం చంద్రబాబు ధ్రువీకరించారట.. 21న జరిగిన కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత సీఎం రాధా టీడీపీలో చేరుతారట.. పార్టీ ప్రయోజనాల కోసమే రాధాను టీడీపీలోకి ఆహ్వానిస్తున్నామని చంద్రబాబు, రంగా ఆశయసాధనకోసం వెళ్తున్నానని రాధా చెప్తున్నారు.
మీ నాన్నగారిని చంపిన పార్టీకి ఎలావెళతారని మీడియా వేసిన ప్రశ్నలకు రాధా చెప్పిన సమాధానం వింటే పైనున్న రంగా ఆత్మ ఎంత సంతోషపడుతుందో చెప్పాల్సిన అవసరం లేదు. తండ్రిని చంపిన పార్టీలోకి ఎలా వెళతారని మీడియా అడిగిన ప్రశ్నకు అది కొంతమంది వ్యక్తులు చేసింది పార్టీకి సంబంధం లేదని రాధా సెలవిచ్చారు. మరి ఇంతకాలం నువ్వే కదా తెలుగుదేశం పార్టీ నా తండ్రిని పొట్టన పెట్టుకుందని అరిచావు తప్పకుండా పైనుండి ఈ ఘోరాలను చూస్తూ నేను దుష్ట టీడీపీ పై పోరాటాన్ని, అన్యాయం పై తిరుగుబాటు చేయడాన్ని నేర్పిన నా వంశమేనా ఇది అని కచ్చితంగా రంగా కంటతడి పెట్టుకోవడం ఖాయం.