సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పడానికి సిద్దమై ,ఆయన విపక్షనేత ,వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ ఇంటికి బయల్దేరాన్న సమచారం రాగానే తెలుగుదేశం పార్టీ ఆయనను సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది.అంతవరకు అభ్యంతరం లేదు కాని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు టీడీపీ ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు జనసేనలో చేరడానికి వెళ్లినా, ఆ పార్టీ అదినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నా, సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటనే రాలేదట.
అంటే పవన్ కళ్యాణ్ తో స్నేహ భావమా?లేక జనసేనలోకి టీడీపీ ఎమ్మెల్యేలు వెళ్లినా పర్వాలేదన్న ఉద్దేశమా అంటూ నెట్ లో వ్యాఖ్యలు వస్తున్నాయి.కిషోర్ బాబు జనసేనలోకి వెళుతున్నప్పుడు నిజంగానే సస్పెండ్ చేయకుండా ఉంటే అది ఆశ్చర్యం కలిగించే విషయమే.అనుమానాలకు తావిచ్చే వ్యవహారమే అవుతుంది.