ఏపీ రాజకీయాలను కుదిపేస్తూ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో చేరబోతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కడప జిల్లాలో టీడీపీ తరపున గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే అయిన రాజంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. అందులో భాగంగా ఆయన ఈ రోజు మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డిపై సస్పెన్షన్ వేటు కూడా వేశారు. వైసీపీ నుండి టీడీపీలో చేరి మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి తనకు వ్యతిరేకంగా ఒక ప్రముఖ ట్రావెల్స్ యజమానిని తీసుకోస్తున్నారు. నన్ను రాజకీయంగా అణగదొక్కుతున్నారని అందుకే పార్టీలో ఉండాలా.. రాజీనామా చేయాలా అనే అంశం మీద తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడ్ని కలవాలని అనుకున్న తరుణంలో బాబు మేడాకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా టీడీపీ నుండి మేడాను సస్పెండ్ చేశారు. అయితే ఇదే జిల్లాలో జమ్మలమడుగు టీడీపీ సీనియర్ నేత అయిన రామసుబ్బారెడ్డి కూడా టీడీపీని వదిలి వైసీపీలోకి రావాలని రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు వార్తలోస్తున్నాయి..
