ఏపీ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా మూడు పార్టీలు హోరాహోరిగా తలపడనున్నాయి. అధికారంలో ఉన్న టీడీపీ , ప్రతి పక్షంలో ఉన్న వైసీపీ మరోక పార్టీ జనసేనా . 2014 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిన వైసీపీ ఈ సారి అలాంటి పొరపాట్లు లేకుండా వ్యూహాత్మకంగా ముందుకెల్తోంది.ఎన్నికల సమయం కాబట్టి జంపింగ్‌లు భారీగా చోటు చేసుకుంటున్నాయి. ఎక్కువగా ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగతున్నాయి. ఇప్పటికే కర్నూల్ జిల్లాలోని ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నీరజా రెడ్డి వైసీపీలో చేరారు.తాజాగా జిల్లాలోని ఆలూరు నియోజకవర్గంలోని అధికారంలో ఉన్న టీడీపీ నుండి ప్రతిపక్ష పార్టీలోకి చేరికలు జరిగాయి. వైస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో వైసీపీ కోడుమూరు నియోజకవర్గ ఇంచార్జ్ మురళి కృష్ణ ఆధ్వర్యంలో కోడుమూరు కు చెందిన 200 మంది టీడీపీ నుంచి వైసీపీ లోకి చేరారు. వీరందరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న కర్నూలు జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , వైసీపీ కర్నూలు పార్లమెంటరీ అధ్యక్షుడు బి వై రామయ్య మరియు తదితరులు.
