నెల్లూరు నగర ప్రజలకు సొంత డబ్బుతో సేవా కార్యక్రమాలు చేస్తూ నగర ప్రజలతో శబాష్ మా యువ ఎమ్మెల్యే అని అనిపించుకుంటున్నాడు ఎమ్మెల్యే అనిల్ కుమార్
అనిల్ కుమార్ యాదవ్ దెబ్బకి నెల్లూరు వదిలి వెళ్లిపోతానంటున్న నారాయణ..
నెల్లూరు సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే అనిల్ తో నాకు వద్దు అని వెనక్కి తగిన నారాయణా??? అవును మీరు వినింది నిజమే .మంత్రి నారాయణా నెల్లూరు నగరంలో పోటీ చేయాలి అనుకోవడం నిజమే కానీ ప్రస్తుత నెల్లూరు నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న ప్రజల్లోకి అందుబాటులో ఉండటం నిత్యం ప్రజలకు సేవ చేయడం రాష్ట్ర చరిత్రలో ఏ నాయకుడు చేయని విధంగా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి గడపకి వెళ్లి తాను ప్రజలకు ఏం చేయబోతున్నాను ప్రజలు తన నుంచి ఏం చేయాలనుకుంటున్నారు అని ప్రజల వద్దకే వెళ్లి వివరించడం వంటి కార్యక్రమాలు చేయడం,అలాగే తన ఆస్తులు అమ్మి నగర ప్రజలకు తన వంతుగా దాహార్తిని తీర్చి పేద వాడికి వైద్యం ప్రజల వద్దకే తీసుకువెళ్ళాలి అని రాజన్న కంటి వెలుగు ,రాజన్న గుండె భరోసా లాంటి మహాత్తరమైన సేవా కార్యక్రమాలు చేసి ప్రజల గుండెల్లో స్తానం సంపాదించుకున్నారు .వందల కోట్లు రూపాయలతో ప్రారంభించిన A.c సుబ్బారెడ్డి ప్రభుత్వ హాస్పటల్ ను మంత్రి నారాయణ తన సొంత మెడికల్ కాలేజ్ కోసం ఏ విధంగా నాశనం చేశారో ప్రజలందరికి తెలిసేలాగా చెయ్యడంలో, అలాగే నెల్లూరు నగరంలో జరుగుతున్నటువంటి భూగర్భ డ్రైనేజీ ,హౌస్ ఫర్ ఆల్ పథకం లో మంత్రి నారాయణ చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో అనిల్ సక్సెస్ అయ్యాడు అనే చెప్పాలి.నారాయణ తన కార్పొరేట్ వ్యవస్థని మా వాడు కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టిన నెల్లూరు నగర ప్రజల్లో అనిల్ కు ఉన్నటువంటి ఆదరణ యువత లో ఉన్నటువంటి అభిమానాన్ని నారాయణ ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా జరప లేడు అనేది జనమెరిగిన సత్యం..ఇలాంటి విషయాలను తెలుసుకున్నటువంటి నారాయణ నాకొద్దు నెల్లూరు నగరంలో అనిల్ తో పోటీ అని చెప్పి వెనకడుగు వేస్తున్నారు అని చెప్పి విశ్వసనీయత సమాచారం ఇది. ఏమైతేనేమి ఒక యువకుడిని వందల కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఓడకట్టాలని తెలుసుకొని మంత్రి నారాయణ చివరికి నాకొద్దు మహాప్రభో అని చంద్రబాబు నాయుడు దగ్గర తన బాధని వెళ్ళగొట్టు కున్నాడని తెలుగుదేశం పార్టీ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు నేను పోటీ చేయనయ్యా అని చంద్రబాబు కి మోర పెట్టుకున్నట్టు విశ్వసనీయ సమాచారం.