ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే ఒకరు అధికార టీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అసిఫాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా అత్రం సక్కు విజయం సాధించారు. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తనకు మంత్రి పదవి ఇస్తే పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నానని సక్కు లీకులు ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇలా షరతులు విధించడం పట్ల పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి కోసం పార్టీ మారడం తప్పుకాదని అయితే, ఇలా షరతులు పెట్టడం ఏంటని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలాఉండగా…ఈ జంపింగ్ ఎపిసోడ్‌తో కాంగ్రెస్ పార్టీలో కలవరం మొదలైందని అంటున్నారు.