Home / ANDHRAPRADESH / పోలీసుల‌కు సంచ‌ల‌న ఫిర్యాదు చేసిన కేఏపాల్‌

పోలీసుల‌కు సంచ‌ల‌న ఫిర్యాదు చేసిన కేఏపాల్‌

క్రైస్తవ మత ప్రచారకుడు, ప్రజాశాంతి రాజకీయ పార్టీ అధ్యక్షుడైన కేఏ పాల్ ఏపీలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ఇప్పటికే చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నెక్ట్స్ సీఎం తానేనని ధీమా వ్యక్తం చేశారు. తాను సీఎం అయ్యాక ఇప్పటి సీఎం చంద్రబాబును తన సలహాదారుడిగా పెట్టుకుంటానన్న వార్త వైరల్ అయింది.అయితే, దీనికి తోడుగా మ‌రిన్ని వీడియోలు వైర‌ల్ అయ్యాయి. తనను, తన వ్యాఖ్యలను కామెడీ చేసి వీడియోలు తయారుచేశారని.. అలాంటి వీడియోలను తొలగించాలని పోలీసులను కోరారు.

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ను కలిసి సోషల్ మీడియాలో ట్రోలింగ్ పై హైదరాబాద్ సీపీని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఫిర్యాదు చేశారు. తనపై అసత్య ప్రచారం జరుగుతోందని పోలీసులకు చెప్పారు. తనను, తన వ్యాఖ్యలను కామెడీ చేసి వీడియోలు తయారుచేశారని.. అలాంటి వీడియోలను తొలగించాలని పోలీసులను కోరారు. ఇటువంటి పోస్టులు తయారుచేస్తున్న వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కేఏ పాల్ కంప్లయింట్ చేశారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ ఈ మధ్య తాను కొన్నియూట్యాబ్, మీడియా ఛానెళ్లకు ఇంటర్వూలు ఇచ్చానని, అందులో మాట్లాడిన మాటలను ఇష్టం వచ్చినట్టుగా ఎడిట్ చేసి ట్రోల్ చేస్తున్నారని ఆయన పోలీసులకు వివరించారు.

ఓ ఇంటర్వూలో ప్రజలను ఉద్దేశించి పాట పాడితే ప్రస్తుతం దాన్ని కొందరు ట్రోల్ చేస్తున్నారని పాల్ వాపోయారు. తన మాటలను.. సోషల్ మీడియాలో వక్రీకరిస్తున్నారని పాల్ ఫిర్యాదు చేశారు . “నాకున్న మంచి ఇమేజ్ ను డిస్ట్రాయ్ చేస్తున్నారు. యూ ట్యూబ్ వీడియోల్లో ఫాల్స్ ప్రొపగాండా చేస్తున్నారు. అమెరికా నుంచి డబ్బు తెచ్చి దుర్వినియోగం చేశాననీ.. చారిటీలను సొంత పేర్లతో పెట్టుకున్నానని.. రుజువులు లేకుండా ఆరోపణలు చేస్తున్నారు. యూట్యూబ్ లో డబ్బు కోసం కొందరు… రాజకీయ నాయకులు మరికొందరు కలిసి… నా మంచి ఇమేజ్ ను నాశనం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నాకున్న ఫాలోయింగ్ ను మీడియాలో చూపించాలని కోరుతున్నా. ప్రపంచంలోనే మొదటిసారి ఓ కంప్లయింట్ చేస్తున్నా. ఇంకోసారి చేయొద్దని కోరుకుంటున్నా. నా మీద కామెడీలు చేయొద్దు. ఆ వీడియోలు తీసేయిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు” అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat