ఆపత్కాలంలో అర్హులైన నిరుపేదలకు అండగా.. ఆపద్భందువులుగా మేమున్నామని…. తెలంగాణ ప్రభుత్వం భరోసాను ఇస్తున్నదని మాజీ మంత్రి వర్యులు తన్నీరు హరీశ్ రావు స్పష్టం చేశారు. సిద్ధిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని ఆయన నివాసంలో మంగళవారం ఉదయం సిద్ధిపేట నియోజక వర్గానికి చెందిన 97 మందికి రూ.23 లక్షల 75వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. నియోజకవర్గ పరిధిలోని సిద్ధిపేట పట్టణంలో 10 మంది లబ్ధిదారులకు రూ.3.41.500 లక్షలు, సిద్ధిపేట మండలంలో 18 మంది లబ్దిదారులకు రూ.5, 30, 500 లక్షలు.., అలాగే చిన్నకోడూర్ మండలంలో 35 మంది లబ్దిదారులకు రూ.9.80.500 లక్షలు, నంగునూరు మండలంలోని 17 మంది లబ్ధిదారులకు రూ.5. 22.500 లక్షల మేర మొత్తం రూ.23లక్షల 75వేల సీఎంఆర్ ఎఫ్ చెక్కులను అందించారు.
– సిద్ధిపేట నియోజకవర్గంలో 2485 మందికి రూ.13కోట్ల 36 లక్షల 81వేల 786 రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ
సిద్ధిపేట నియోజకవర్గం పరిధిలో ఇప్పటి వరకూ నియోజక వర్గంలో 2285 మంది లబ్ధిదారులకు రూ.9.47.31.286 కోట్లు సీఎం సహాయ నిధి ద్వారా అందించినట్లు తెలిపారు. అలాగే నియోజక వర్గంలో 200 మంది లబ్ధిదారులకు రూ.3.89.50.500 కోట్లు అత్యవసర పరిస్థితుల్లో ఆదుకునేలా (ఎల్ఓసీ)లు జారీ చేసినట్లు హరీశ్ రావు చెప్పారు. అనారోగ్యంతో ఉన్న వారికి అండగా తానున్నానంటూ సీఎం సహాయ నిధి నుంచి సహాయం చేస్తున్నామని.. అత్యవసర వైద్య సేవలకు నిధులు సమకూర్చి.. ఆపత్కాలంలో ఉన్న అర్హులైన నిరుపేదలు ఏవరైనా సరే వారిని ఆదుకునేందుకు ముందుంటామని హరీశ్ స్పష్టం చేశారు.