Home / 18+ / కడపలోని 10 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీకి డిపాజిట్లు గల్లంతేనా.?

కడపలోని 10 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీకి డిపాజిట్లు గల్లంతేనా.?

చంద్రబాబు గంజాయి వనం నుంచి బయట పడ్డానని, వైయస్‌ జగన్‌ తులసి వనంలోకి అడుగుపెట్టినందుకు ఆనందంగా ఉందని కడపజిల్లా రాజంపేట తెలుగుదేశం ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి అన్నారు. జగన్‌ మోహన్‌ రెడ్డి కలిసి పార్టీ తీర్ధం పుచ్చుకునేందుకు సిద్దమయ్యారు. అనంతరం మేడా మీడియాతో మాట్లాడుతూచంద్రబాబు గంజాయి వనం నుంచి వైయస్‌ జగన్‌ తులసి వనంలోకి వచ్చినంత ఆనందంగా ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ కాంగ్రెస్‌ను ఎదురించి సొంత పార్టీ ఏర్పాటు చేసిన జగన్‌ తండ్రిస్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చారని, నిజమైన ప్రజాస్వామ్య విలువలు కలిగిన జగన్‌ లాంటి మంచి వ్యక్తి వద్దకు రావడం సంతోషంగా ఉందన్నారు.

టీడీపీలో మెలగలేక ఆ పార్టీని వీడానన్నారు. అధికారుల సహకారంతో ఇప్పటి వరకు రాజంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని, జగన్‌ సమర్ధుడని నమ్మి వైయస్‌ఆర్‌సీపీలో చేరేందుకు ముందుకు వచ్చానన్నారు. వైయస్‌ఆర్‌ కుటుంబం చేస్తున్న పోరాటాలకు ఆకర్శితుడినై పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. చంద్రబాబు.. నిన్ను నమ్మం.. అందుకే వైయస్‌ఆర్‌సీపీలో చేరుతున్నానని పేర్కొన్నారు. చంద్రబాబు చెప్పేది ఒకటి చేసేది మరోకటి అని విమర్శించారు. నిరుద్యోగ భృతి ఇస్తానని యువత ఓట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వారిని దగా చేశారన్నారు. కాపులను చేసిన మోసాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పారు.

ఈ నెల 31న వైయస్‌ఆర్‌సీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. జగన్‌ సూచనల మేరకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైయస్‌ఆర్‌సీపీలో చేరుతానని ప్రకటించారు. స్పీకర్‌ ఫార్మెట్‌లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువలకు వన్నె తెచ్చే విధంగా వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుంటామని పేర్కొన్నారు. అయితే 2014 సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా మేడా పోటీ చేసి గెలియారు. జిల్లాలో టీడీపీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఈయనే. అయినా సరే మేడాకు ప్రాధాన్యత తగ్గించడం పట్ల ఆయన కొద్దిరోజులుగా వైసీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకున్నారట. మేడా పార్టీ మారతారన్న ప్రచారం రావడంతో ఆయనను బుజ్జగించడం మాని ఆయనను విస్మరించడం పట్ల ఆయన వైసీపీలో చేరుతున్నారు. ప్రస్తుత పరిణామాలతో కడప జిల్లా మొత్తం సీట్లు వైసీపీ గెలుచుకోతుండడం జిల్లా రాజకీయ వాతావరణంలో స్పష్టంగా కనిపిస్తోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat