Home / TELANGANA / చతుర్వేద మహారుద్ర సహిత సహస్ర చండీయాగం..!!

చతుర్వేద మహారుద్ర సహిత సహస్ర చండీయాగం..!!

మహా రుద్ర సహిత సహస్ర మహా చండీ యాగ పాంచాహ్నిక దీక్షలో భాగంగా రెండవ రోజు మంగళవారం నాడు ఉదయం 9 గంటల నుండి వంద మంది ఋత్వికులు 200 చండీ పారాయణాలు పూర్తి చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి దంపతులు మహాహారతి, మంత్ర పుష్పముతో మాద్యాహ్నిక పూజలు పూర్తి చేశారు . సాయంత్రం 4 గంటల నుండి 3 లక్షల నవార్ణ జపము పూర్తి చేశారు . రాత్రి 7.30 కి మహా హారతి మంత్ర పుష్పము , చతుర్వేద సేవలు , తీర్ధ ప్రసాద వితరణ కార్యక్రమాలు పూర్తి చేశారు .

మహారుద్ర యాగము
—————————–

ఉదయం 9 గంటలకు శాంతి పాఠముతో ప్రారంభమైన మహా రుద్ర యాగము 41 ఏకాదశ అభిషేకములు పూర్తి చేశారు . సాయంత్రం 3 గంటల నుంచి 41 ఏకాదశ రుద్ర హోమములు పూర్తి చేసుకొని క్రమార్చణ హారతి , మంత్ర పుష్పము , తీర్ధ ప్రసాద వితరణతో కార్యక్రమం పూర్తయినది .

 

రాజశ్యామల యాగము
———————————

రాజశ్యామల యాగములో భాగంగా మంగళవారం ఋత్వికులు రాజశ్యామల అనుష్టానం , హోమం, రాజశ్యామల మహావిద్య పారాయణం , హోమం , సహస్ర నామార్చన నిర్వహించారు.

 

బగళాముఖి
—————–

ఉదయం 9 గంటలకు 10 మంది ఋత్వికులు పది వేల జపము పూర్తి చేశారు . సాయంకాలం 10 మంది ఋత్వికులు 10 వేల జపము , హరిద్రాన్నముతో మూల మంత్ర హవనము 2 వేలు పూర్తి చేశారు .

 

ప్రతి రోజు ఋగ్వేదము, యజుర్వేదము, సామ వేదము , అధర్వణ వేదము మరియు శుక్ల యజుర్వేదము పారాయణములు హవనాదులు , సుందరాకాండ , విరాటపర్వ , మహా సౌర పారాయణాలు జరుగుచున్నవి . ఈ కార్యక్రమాలన్నీ శృంగేరి పీఠాధిపతులు , శారదా పీఠాధిపతుల దివ్య ఆశీస్సులతో విద్వదాహితాగ్ని బ్రహ్మశ్రీ మాడ్గుల మాణిక్య సోమయాజులు గురువు గారి పర్యవేక్షణలో జరుగుచున్నవి. పూజా కార్యక్రమాలు వేద పండితులు పురాణం మహేశ్వర శర్మ , మంగళంపల్లి వేణుగోపాల శర్మ , శాస్త్రుల వెంకటేశ్వర శర్మ , ఫణి శశాంక శర్మ , గంగవరం నారాయణ శర్మ, జి.కామేశ్వర శర్మ , కాసుల చంద్ర శేఖర శర్మ ల నిర్వహణలో అత్యంత వైభవంగా జరుగుచున్నవి . ఈ యాగ కార్యక్రమ సమన్వయకర్తగా శ్రీ అష్టకాల రామ్మోహనరావు వ్యవహరిస్తున్నారు .

ఈ యాగ కార్యక్రమానికి హోంమంత్రి మహమూద్ అలీ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు , ఎంపీలు , ఎమ్మెల్సీలు , రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat