వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీల మధ్య అవగాహన కుదిరింది. అది కూడా ఫెడరల్ ఫ్రంట్, అలాగే ప్రత్యేక హోదా విషయంలో మాత్రమే. అది కూడా ఏపీ ఎన్నికల తర్వాత మాత్రమే అనేది జగన్ నిర్ణయం. జగన్ మాత్రం సింగిల్ గా పోటీ చేయడంలేదు టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నాడు అని పచ్చ మీడియా నానా హంగామా చేసింది. కానీ జగన్ ఒకే మాట మీద, ఒకే ధర్మం కోసం, ఒకే నిర్ణయంతో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు తాను సింగిల్ గానే వెళ్తానని, ఆ మాటకే కట్టుబడి ఉన్నారు జగన్ మోహన్ రెడ్డి. స్నేహంతో వచ్చిన కేటీఆర్ తో ఎంతో ఆత్మీయంగా మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేందుకు మా వంతు సహకారం అందిస్తాం అని ప్రకటించారు. ఇప్పటివరకూ ఎవ్వరి సాయం లేకుండానే ప్రత్యేక హోదా ఉద్యమాన్ని కింది స్థాయి నుంచి దిల్లీ స్థాయి వరకూ నడిపించిన ప్రతిపక్ష నేత ఎక్కడా మరో పార్టీని మద్దతిమ్మని తిరగలేదు. స్వరాష్ట్రంలో యువతను ఏకం చేసి ప్రజలను చైతన్య వంతులను చేసాడు. ప్రభుత్వం దిగివచ్చేలా చేసాడు. దిల్లీ నడిబొడ్డున హోదా కోసం ఎందాకైనా అంటూ గర్జించాడు. నేరుగా కేంద్రంతోనే తలపడ్డాడు. హోదా ఇవ్వకుంటే మా ఎంపీలు వైదొలుగుతారని ప్రకటించి, తాను పాదయాత్ర చేస్తూనే తన ఎంపీలతో హోదా ఉద్యమాన్ని ఉవ్వెత్తున కొనసాగించాడు. తాను కదలకుండానే హోదా ఉద్యమ రధాన్ని కదిలించాడు. జగన్ పిలుపుతో ప్రత్యేక హోదాకోసం రాష్ట్రమే కదిలి వస్తోంది. పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటున్న చంద్రబాబు కనీసం పొరుగు రాష్ట్రంలో ఉన్న తెలుగు ముఖ్యమంత్రి కూడా నమ్మడం లేదు. నేడు టిఆర్ఎస్ స్వయంగా కదిలి వచ్చి ఫెడరల్ ఫ్రంట్ కోసం మద్దతు కోరింది. కేటీఆర్ జగన్ ని కలవడం గురించి టీడీపీ, ఎల్లో మీడియా కలిసి చేసిన రాద్ధాంతం మామూలుది కాదు. కేటీఆర్, జగన్ భేటీ వార్త వచ్చిన దగ్గరనుండి తెలుగుదేశం నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెట్టాయి.. కానీ వైఎస్ జగన్ నిర్ణయంతో పొత్తుల విషయంలో బురదజల్లాలని తెగ ఎదురుచూస్తున్న వీరందరి గొంతులో పచ్చివెలక్కాయ పడింది. జగన్ మాట అన్నాడంటే అందులో ఏమార్పు లేదు. వీరి కలయికను తప్పుగా చూపించాలనుకున్నవారంతా ఇప్పుడు పొలిటికల్ బఫూన్లుగా మిగిలిపోయారనటంలో ఆశ్చర్యం లేదు.
