తెలంగాణ తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల హవా కొనసాగుతుంది.మెజార్టీ గ్రామ పంచాయతీలను టీఆర్ఎస్ పార్టీ దక్కించుకుంటోంది. మొదటి విడతలో రాష్ట్రంలో 4వేల 479 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. వీటిలో ఇప్పటికే 769 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. 3వేల 701 గ్రామాలకు ఇవాళ పోలింగ్ జరిగింది.ఈ క్రమంలోనే రాత్రి 8.30 గంటల సమయం వరకు ప్రకటించిన ఫలితాల్లో అత్యధిక స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు..
టీఆర్ఎస్ – 2299
కాంగ్రెస్ – 764
టీడీపీ – 20
BJP – 55
CPI – 16
CPM – 26
OTHERS – 625
