తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఓ ఇంగ్లీష్ మీడియా ప్రచురించిన వార్తపై తీవ్ర అగ్రహారం వ్యక్తం చేశారు.వివరాల్లోకి వెళ్తే ఈ రోజు నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవెల్లి లోని తన వ్యవసాయ క్షేత్రంలో సహస్ర మహాచండీయాగం చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే సీఎం కేసీఆర్ రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఘనవిజయం కోసం, దేశానికి ప్రధాని కావాలనే ముఖ్య లక్ష్యంతోనే ఈ రోజు నుంచి ఐదు రోజుల పాటు సహస్ర మహా చండీయాగం చేస్తున్నారని ఓ ప్రముఖ ఇంగ్లీష్ మీడియా.. ఒక వార్త ప్రచురించింది. అయితే ఈ వార్తను హర్షవర్ధన్ అనే వ్యక్తి మాజీ మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై కేటీఆర్ స్పందిస్తూ.. సంబంధిత పత్రికకు తనదైన స్టైలులో చురకలంటించారు.కొన్ని మీడియా సంస్థలు నిజనిజాలు తెలుసుకోకుండా, కామన్ సెన్స్ లేకుండా వార్తలను పబ్లిష్ చేస్తున్నాయని..ఇటువంటి వార్తలను పబ్లిష్ చేయడం పట్ల సంబంధిత ఎడిటర్ల విజ్ఞతకే వదిలేస్తున్నామని కేటీఆర్ ట్వీట్ చేశారు.
Some news outlets don't seem to have the basic commonsense to do a fact check before publishing utter nonsense
Leave it to the wisdom of the respective editors https://t.co/Z94eiQrrXo
— KTR (@KTRTRS) January 21, 2019