రాజధాని ప్రాంతంలోని కీలకమైన కృష్ణా జిల్లా మరోసారి రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది. వైసీపీకి దివంగత వంగవీటి మోహనరంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ వైసీపీకి రాజీనామా చేశారు. కొన్ని కారణాలతో పార్టీకి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. తమ పార్టీ అధ్యక్షుడు జగన్ కు రాజీనామా లేఖను పంపించానని, భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని, మళ్లీ రెండు రోజుల తర్వాత మీడియా ముందుకు వస్తాను. మీకు అన్ని వివరాలు చెబుతాను. అందరితో మాట్లాడి ఏం జరిగిందన్నది చెబుతాను. నాతోపాటు మరో 10 మంది ఉన్నారు. వారితో కూర్చుని చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని రాధా వివరించారు. అయితే రాజకీయాల నుంచి తప్పుకునే అవసరం లేదన్నారు. జనసేనలోకి వెళ్తున్నారా, టీడీపీలో చేరతారా అనే ప్రశ్నకు తన వాళ్లతో మాట్లాడి సమాధానం చెబుతానన్నారు.
విషయానికొస్తే విజయవాడ సెంట్రల్ సీటును రాధా ఆశించారు. సెంట్రల్ సీటు మల్లాది విష్ణుకు ఇచ్చేందుకు పార్టీ సిద్ధమైంది. కాబట్టి విజయవాడ ఈస్ట్, లేక మచిలీపట్నం నుంచి సీటు కేటాయిస్తామని చెప్పారట.. ఈ వ్యవహారం తేలడానికి ఇంకా సమయం కూడా ఉంది కానీ ఇంతలోపే రాధా రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే మనస్తత్వం కాదు నాది. పోరాటమే నా ఊపిరి అంటూ తన రాజీనామా లేఖలో తన తండ్రి వంగవీటి మోహనరంగా చెప్పిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. అయితే రాజకీయంగా గౌరవంగా రాధా పార్టీ నుంచి వెళ్లిపోయారు. అయితే రాజకీయాల్లో ఈ రావడాలు పోవడాలు సర్వసాధారణమైనవే.. కానీ రాధా తన తండ్రిని కిరాతకంగా నరికి చంపిన తెలుగుదేశం పార్టీలోకి వెళ్లనని చెప్పలేకపోవడం ఎంతవరకూ సబబు.. తనను అమ్మను స్టేషన్ లో కూర్చోబెట్టిన పార్టీలోకి వెళ్లనని రాధా చెప్పలేకపోయారు.
పోనీ జనసేనలోకి వెళ్తే ఆయన ట్రాక్ రికార్డు ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం.. 2004 లో కాంగ్రెస్ నుంచి గెలిచారు. అనతరం వైఎస్సార్ ని వదులుకుని 2009లో ప్రజారాజ్యంలో చేరి ఓడిపోయారు. తిరిగి 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు తెలుగుదేశం లేదా జనసేన పార్టీలోకి వెళ్లాలనుకుంటున్నారు. అయితే రాధా వర్గం అనుకుంటున్నట్టు చెప్పినట్లు కాపులు అందరు ఓట్లు వేస్తారా అంటూ అదీ లేదు.. అయితే రాధా తండ్రిని చంపిన పార్టీలోకి వెళ్ళాలి లేదా కులపిచ్చి అని ముద్ర పడుతున్న పార్టీలోకి వెళ్ళాలి.. ఏది జరిగినా రంగా ఆత్మను క్షోభపడడం ఖాయం.. ఈ నేపధ్యంలో రాధాబాబు తీసుకున్నది కచ్చితంగా తొందరపాటు నిర్ణయంగానే కనిపిస్తుంది.