మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఇప్పటికే ప్రస్తుత అధికార టీడీపీ పార్టీ,ప్రతిపక్ష పార్టీ ఐన వైసీపీ ఆయా నియోజకవర్గాల్లో జోరుగా ప్రచారం మొదలు పెట్టాయి.అయితే ఈ క్రమంలోనే వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ రానున్న ఎన్నికల్లో ఎక్కడినుంచి పోటిచేస్తారో ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.రాష్ట్రంలోని చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచే తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఎంపీగా పోటీ చేస్తారన్న వార్త కుట్రపూరిత ప్రచారమేనని తెలిపారు.అలాగే గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ వల్లే టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిందని..రానున్న ఎన్నికల్లో వైసీపీకి కచ్చితంగా 100 సీట్లకు పైగానే వస్తాయని జోస్యం చెప్పారు బొత్స . జగన్ ప్రవేశపెట్టిన ‘నవరత్నాలు’ను చంద్రబాబు కాపీ కొడుతున్నారని విమర్శించారు.
