ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైసీపీలో ఇప్పటికే వలసలు మరింత పెరిగాయి. ఏపీలో ప్రతి పక్షంలో ఉన్న వైసీపీ వైపు చూసేందుకు ఇప్పటికే చాలా మంది నేతలు చూస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో అధికారంలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. టీడీపీకి చెందిన కీలక నేత బీసీఎల్ నందకుమార్ డెవిడ్‌తో పాటు పలువురు సీనియర్ నేతలు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా నల్లపరెడ్డి మీడియాతో మాట్లాడుతూ… వైసీపీ ఆధినేత వైఎస్ జగన్ హత్యయత్నంపై ఎన్‌ఐఏ విచారణపై చంద్రబాబు ఎందుకు వణికిపోతున్నాడో అర్థం కావడం లేదన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తుల కేసులో రెండో ముద్దాయిగా ఉన్న వెంకట రమణను టీడీపీలో చేర్చుకోవడంతోనే మీ బండారం బయటపడిందన్నారు. వెంకటరమణ చంద్రబాబుకు బినామీగా వ్యవహరిస్తున్నారు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.
