అక్కినేని అఖిల్ హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న యూత్‌పుల్ ఎంటర్‌టైనర్ ‘మిస్టర్ మజ్ను’. ఈ చిత్రాన్ని రిపబ్లిక్ డే కానుకగా ఒకరోజు ముందు ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో చీఫ్ గెస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యాడు.అయితే ఈ సందర్భంగా అఖిల్ తన అభిమానులకు ఓ సందేశం అందించాడు.”ఈమధ్య ఓ విషయం తెలుసుకున్నాను. రెడ్డి అనే ఓ అభిమాని మరో ఇద్దరితో కలిసి విజయవాడ నుంచి తిరుపతి 450 కిలో మీటర్లు కాలినడకన వెళ్లారట. ఈ విషయం తెలుసుకున్న వెంటనే నా కంట్లోంచి నీళ్లొచ్చాయి. ఇదంతా అవసరం లేదు. మీ అభిమానం మాతో ఉంది. అది చాలు. ఇలాంటి సాహసాలు చేయకండి. మీ కుటుంబ సభ్యులు మీపై చాలా ఆశలు పెట్టుకుంటారు. వాళ్లంతా బాధపడుతుంటారు. ఇంకెప్పుడూ ఇలాంటి సాహసాలు చేయకండి” అని అభిమానుల్ని అఖిల్ కోరాడు .
