విపక్షాలు చేస్తున్న ప్రచారానికి టీఆర్ఎస్ ఎంపీ కవిత చెక్ పెట్టారు. కోల్‌కతాలో జరిగిన ప్రతిపక్షాల ఐక్యతార్యాలీకి టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హాజరుకాలేకపోవడంపై విపక్షాలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ఎంపీ కవిత క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల బిజీ కారణంగానే సీఎం కేసీఆర్ శనివారం కోల్‌కతాలో జరిగిన ఐక్యతార్యాలీకి హాజరు కాలేకపోయారని ఆమె స్పష్టం చేశారు. భవిష్య త్తులో బీజేపీయేతర, కాంగ్రెసేతర ర్యాలీల్లో టీఆర్‌ఎస్ పార్టీ కచ్చితంగా పాలుపంచుకుంటుందని చెప్పారు.
అసెంబ్లీ సమావేశాలతో పాటుగా స్పీకర్ ఎన్నిక, సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ఉండటంతో సీఎం కేసీఆర్‌కు సమయం లేకపోయిందని ఎంపీ కవిత వివరించారు. సీఎం కేసీఆర్ చెప్పినట్టుగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలు ఇచ్చిన అవకాశాలను వినియో గించుకోలేదని పేర్కొన్నారు. దేశ రాజకీయాల్లో టీఆర్‌ఎస్ క్రియాశీల పాత్ర పోషించబోతున్నదన్నారు.