ఈటీవీలో ప్రసారమయ్యో జబర్ధస్త్ కామెడి షో తో పరిచయం అయిన హాట్ యాంకర్ అనసూయ తక్కువ కాలంలోనే యాంకర్ గా పలు ఛానల్స్ లో బిజీ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం వెండి తెరపై కూడా తన సత్తా చాటుతుంది అనసూయ. ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో రాంచరణ్, సమంత నటించిన ‘రంగస్థలం’సినిమాలో రంగమ్మత్తగా అనసూయకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత వరుసగా టాలీవుడ్ లో అవకాశాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ‘యాత్ర’సినిమా తీస్తున్న సంగతి తెలసిందే. అయితే ఈ సినిమాలో యాంకర్ అనసూయ కర్నూల్ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి పాత్రలో నటిస్తుంది. కాగా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర సమయంలో 2004 లో కాంగ్రెస్ పార్టీ తరపున నందికొట్కూరు నియోజిక వర్గం నుండి పోటీ చేసి చరితా రెడ్డి ఏవిందంగా గెలిచింది పార్టీ కోసం ఆమె కష్ట పడిన తీరును అనసూయ పాత్ర ద్వారా సినిమలో చూపించనున్నారు. ఈ సినిమాలో కూడా అనసూయ ‘రంగస్థలం’సినిమాల్లో లాగే డి గ్లామర్ గా కనిపించబోతుందట.
