తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాబోయే ఎన్నికల గురించి మీటింగ్ పెట్టారు.. కానీ దాని గురించి కాకుండా ప్రతిపక్షం మీదే తన అక్కసు వెళ్లగక్కడానికే ఆ మీటింగ్ గడిచిపోయిందట. ప్రధాని మోదీకి, కేసీఆర్ కి, జగన్ లు తనను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుతున్నారట. టీఆర్ఎస్, వైసీపీ కలయికపై వైసీపీ డ్యామేజ్ అయ్యేలా చేయాలని ఆదేశించారట. అంతకంటే ముందే బాబుగారు హరికృష్ణ దగ్గరే కేటీఆర్ తో పొత్తుగురించి చర్చించడం మర్చిపోయాడో ఏమో మరి.. 15ఏళ్ల హోదా కంటే ఎక్కువే బీజేపీ ప్రభుత్వం ఏపీకి ఇచ్చింది అన్న నోటితోనే మోదీ మంచివాడు కాదంటూ ప్రచారం చేస్తున్నారు. అసలు చంద్రబాబు చేసిన ఏ అభివృద్ధిని చూసి ప్రతిపక్షనేత జగన్ అసూయ పడిపోవాలనేది చంద్రబాబు ఉద్దేశమో ఆయనకే తెలియాలి. చంద్రబాబు పొత్తుల ఊసరవెల్లితత్వం గురించి దేశంలో అందరికీ తెలుసు. బీజేపీ అజెండా అమలుకే ఫెడరల్ ఫ్రంట్ అంటూ చంద్రబాబు పదేపదే అబద్ధాన్ని ప్రచారం చేయాలని తాపత్రయ పడుతున్నారు.. మరోవైపు ఆ ఫ్రంట్ కు అసలు స్పందనే లేదంటున్నారు. బిజేపీ వ్యతిరేక శక్తులమంటూ కాంగ్రెస్, టీడీపీ ఫ్రంట్ ను తెలంగాణా ప్రజలు నిర్దాక్షిణ్యంగా తిరస్కరించారు. రేపు ఫెడరల్ ఫ్రంట్ విషయంలోనూ ప్రజలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఎన్నికల తర్వాత తెలుస్తుంది. కూటమి రాజకీయాలు తామే చేయాలని, పొత్తులు తామే పెట్టుకోవాలని వేరే ఏ పార్టీ ఆ ప్రయత్నం చేసినా అది కరెక్ట్ కాదంటాడు. షర్మిళపై జరిగే ట్రోలింగ్ కు కారణం టీడీపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలే అంటూ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరుగుతోంది. అయితే చంద్రబాబు మాత్రం సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేసేది వైసీపీనే అని వితండవాదం మొదలుపెట్టాడు. అయితే టీఆర్ఎస్ వైసీపీ కలవబోతున్నది ఫెడరల్ ఫ్రంట్ గురించి చంద్రబాబు ప్రచారం చేస్తున్నది తెలుగురాష్ట్రాల్లో పొత్తు గురించి. కానీ ముందు పొత్తు గురించి టీఆర్ఎస్ ను సంప్రదించింది చంద్రబాబే.. ఈ అంశాలన్నీ ప్రజలు గమనిస్తున్నారు. జగన్ కేటీఆర్ ల కలయికతో చంద్రబాబు చేసిన ప్రచారంతో ఆయనే అడ్డంగా దొరికిపోయారనేది వాస్తవం.
