Home / ANDHRAPRADESH /  చంద్రన్న వస్తున్నాడు.. హామీలతో ముంచెత్తనున్నాడు.. తస్మాత్ జాగ్రత్త

 చంద్రన్న వస్తున్నాడు.. హామీలతో ముంచెత్తనున్నాడు.. తస్మాత్ జాగ్రత్త

వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడు చెలరేగిపోతాడు.. ఇది పాత సామెత.. ఇప్పుడు మాత్రం వినేవాళ్లు ఏపీ ప్రజలు అయితే చెప్పేవాడు ఖచ్చితంగా చంద్రబాబే అన్న సామెత వినిపిస్తోంది. గతంలో అమరావతిలో ఒకేచోట ఏసీ పెట్టి అమరావతి మొత్తానికి చల్లగాలి సరఫరా చేస్తా అంన్నాడు చంద్రబాబు.. అలాగే విద్యుత్, గ్యాసులాగే ఏసీని కూడా సరఫరా చేస్తాడట ఈ మహా మేధావి.. కేవలం ఒట్టి మాటలతో కోటలు కట్టడం కేవలం చంద్రబాబుకే సాధ్యం..అవ్వని పనులకు కూడా ఎన్నో అద్భుతాలు చెబుతుంటాడు.. పోలవరం పూర్తి కాకుండానే పంటలకు నీళ్లు సరఫరా చేస్తానంటాడు. విండ్ పవర్ తో వ్యవసాయం, సౌర విద్యుత్ తో రాష్ట్రంమంతా వెలుగులు, రెయిన్ గన్ లతో రాయలసీమలో కరువు తరిమేశానంటాడు. అసలు నమ్మాలే గానీ ఆకాశంలో మెరుపులు, చుక్కలు కూడా తెస్తానని చెబుతాడు. అసలు గతంలో ప్రారంభించిన ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా తాగునీరు ఇంటింటికీ ఇస్తానని ప్రచారం చేసి మొదలు పెట్టినట్టే పెట్టి తర్వాత మూసేసాడు. రాష్ట్రంలో ఎక్కడా మంచినీటి సరఫరా లేదు. పేదలకు నెలవారీ ఇచ్చే ప్రజాపంపిణీ వ్యవస్థ లేక చౌకధరల డిపోల్లో సరకుల సరఫరా లేదు.

పండగలప్పుడు చంద్రన్న కానుక అంటూ ఇచ్చే నాసిరకం సరుకుల్లో కొండంత కమీషన్లు.. ఆసుపత్రుల్లో అత్యవసర మందులు లేవు. కుక్కకాటు వాక్సిన్, గర్భిణీల మందులు, కనీసం మలేరియా లాంటి సీజనల్ జ్వరాలకు ఇచ్చే మందులు కూడా ఇవ్వడంలేదు. ప్రభుత్వ ఆసుపత్రులకు కరెంటు సరఫరాకూడా సరిగ్గా లేదు. అరోగ్యశ్రీ నిధుల సరఫరా ఆగి ఉచిత వైద్యసేవలకు గండి పడింది. అసలు చంద్రబాబు చెప్పేదంతా కేవలం ఉత్తమాటలు మాత్రమే.. ఎన్నికలపుడు అబద్ధాలు, దొంగ హామీలు అలవోకగా ఇచ్చేస్తాడు. త్వరలో ఈయన ప్రతీ ఇంటికీ ఏసీ ఇస్తానని అలాగే ప్రతీ పేదవారి కుటుంబానికీ నెలకు రూ.12వేలు కూడా ఇచ్చేస్తామని చెప్పినా ఆశ్చర్యం లేదు. కాబట్టి ఏపీ ప్రజలంతా తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat