టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు గుడి వంశీదర్ రెడ్డిని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ప్రశంసించారు.ఇవాళ హైదరాబాద్ నగరంలోని తెలంగాణ భవన్ లో కేటీఆర్ ని వంశీదర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలోని మదారం, సోమాయికుంట తండ గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా చేసినందున కేటీఆర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఆదే విధంగా ఆ గ్రామాలను ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సహకారంతో ఆదర్శ గ్రామ పంచాయతీ లు గా తీర్చి దిద్దాలన్నారు.
