ఆస్ట్రేలియాలో కోహ్లీ సేన చరిత్ర సృష్టించింది. వరుసగా టెస్టు, వన్డే సిరీస్ను కైవసం చేసుకుంది. ఆతిథ్య జట్టుతో జరిగిన చివరి వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 231 పరుగుల లక్ష్య ఛేదనలో ఎంఎస్ ధోనీ (87; 114 బంతుల్లో 6×4), కేదార్ జాదవ్ (61; 57 బంతుల్లో 6×4) అజేయంగా నిలిచారు. నాలుగో వికెట్కు వీరిద్దరూ 116 బంతుల్లో 121 పరుగుల అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. విరాట్ కోహ్లీ (46; 62 బంతుల్లో 3×4) త్రుటిలో అర్ధశతకం చేజార్చుకున్నాడు.
