ప్రముఖ సినీ హీరో,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేన పార్టీని స్థాపించిన సంగతి తెల్సిందే. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీ పార్టీకి మద్ధతుగా ప్రచారం నిర్వహించారు. కొద్ది రోజుల కిందటనే టీడీపీతో మైత్రీకి కటీప్ చెప్పి రానున్న ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఆ పార్టీ అధ్యక్షుడు అయిన పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈక్రమంలో ఏపీ బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారు. గత సార్వత్రిక ఎన్నికల్లో రాజమండ్రి అర్భన్ స్థానం నుండి గెలుపొందిన ఆకుల సత్యనారాయణ జనసేన పార్టీలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నెల 21న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకోనున్నట్లు ఆయన తెలిపారు.
