వైసీపీ అధినేత వైఎస్ జగన్ పట్ల ప్రజలు సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారని ఆపార్టీ నాయకులు మధు, రత్నాకర్లు అన్నారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడూ చేయలేని సాహసం జగన్ చేశారని, వేల కిలోమీటర్లు ప్రజలతో కలిసి నడిచి ప్రజల సమస్యలు తెలుసుకుని వారి మనసులను గెలుచుకున్నారని తెలిపారు. పాదయాత్ర దారి పొడవునా అన్నివర్గాల ప్రజలతో జగన్ మమేకమయ్యారని, జగన్ పాదయాత్ర యజ్ఞంలా చేశారన్నారు.
ప్రజల సమస్యలు తెలుకుని వాటి పరిష్కరించే దిశగా వైఎస్ జగన్ కొనసాగుతున్నారని తెలిపారు. ప్రజా సంకల్పయాత్ర అనేది ఆంధ్రరాష్ట్రానికే కాకుండా ప్రపంచ రాజకీయాల్లో ఒక చరిత్ర అని తెలిపారు. ప్రజల సంపూర్ణ మద్దతు, ప్రజాదరణ చూసి అధికార పక్షం జీర్ణించుకోలేక తెలుగుదేశం పెద్దలు జగన్ మీద హత్యాయత్నానికి కూడా తెగబడ్డార్ననారు. ప్రత్యేకహోదా సాధించగల శక్తి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డికే ఉందన్నారు. స్పష్టమైన తీర్పు రాబోతుందని, చంద్రబాబు ఓటమి తథ్యమన్నారు.