నోటి నుంచి మాట జారితే దాన్ని సరిదిద్దుకోవడం కష్టం.ముఖ్యంగా సెలబ్రిటీలు ఐతే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అలాంటి పరిస్థితే ఇప్పుడు ఇద్దరు టీమిండియా స్టార్ ఆటగాళ్లు ఎదుర్కొంటున్నారు. కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో రాహుల్, పాండ్యాలు మహిళలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు ఇప్పుడు తగిన మూల్యం చెల్లించుకున్నారు.ఈ ఇద్దరు చేసిన వ్యాఖ్యలు పట్ల సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్నారు.దీంతో బీసీసీఐ, సీఓఏ కన్నెర్ర జేసింది.
ఆస్ట్రేలియాతో జరగబోయే తొలి వన్డేకు మేనేజ్మెంట్ ఈ ఇద్దరి ఆటగాళ్లపై సస్పెన్షన్ వేటు వేసింది.అయితే సస్పెన్షన్ మొదట రెండు వన్డేలకు విధించినా..విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగించాలని సీఓఏ బీసీసీఐకి సూచించింది.విచారణన కొరకు ఇద్దరు ఇండియాకు రానున్నారు.
మహిళలపై నోరు పారేసుకున్న కారణంగా ఈ ఇద్దరిపై బోర్డు కఠిన చర్యలు తీసుకుంది. తనకు పలువురు మహిళలతో సంబంధాలు ఉన్నాయని, ఈ విషయాన్ని తన పేరెంట్స్తోనూ చెప్పానని ఆ షోలో పాండ్యా చెప్పాడు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.