Home / 18+ / వచ్చే ఎన్నికల్లో కీలకపాత్ర పోషించనున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. వెన్నుపోటును వివరంగా

వచ్చే ఎన్నికల్లో కీలకపాత్ర పోషించనున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. వెన్నుపోటును వివరంగా

రాజకీయాలలో ఎవరు, ఎక్కడ ఉంటారో చెప్పలేని పరిస్థితి.. అవును.. ప్రకాశం జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో దగ్గుబాటి కుటుంబం పేరు అందరికీ సుపరిచితమే. ఎన్టీఆర్ అల్లుడిగా చంద్రబాబు నాయుడు పగ్గాలు అందుకొనే కీలక సమయంలోనూ కీలకంగా వ్యవహరించిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు. అయన భార్య ఎన్టీఆర్ కూతురు పురంధేశ్వరి ప్రస్తుతం బీజేపీలో కీలకంగా ఉన్నారు. అయితే ఇప్పుడు వీరి కుమారుడు, ఎన్టీఆర్ కు మనుమడు హితేష్ కూడా రాజకీయాల్లోకి అరంగేట్రం చేయనున్నారట. కానీ హితేష్ ఎంట్రీ మాత్రం వైసీపీ నుండి జరగనుందట.. కారణం హితేష్ పోటీ చేయాలనుకుంటున్న ప్రకాశం జిల్లా పర్చూరు స్థానంలో సిటింగ్ ఎమ్మెల్యే సాంబశివరావును టిడిపి మార్చే ఉద్దేశ్యంలో లేకపోవడం అలాగే ఎన్టీఆర్ మనుమడు కాబట్టి వైసీపీ సీటు ఇచ్చే అవకావాలు ఎక్కువగా కనిపిస్తున్నాయట.

ఈ క్రమంలో చంద్రబాబంటే పడని నందమూరి ఫ్యామిలీకి వైసీపీ కేరాఫ్ అడ్రెస్ అయిపోతోంది. దీంతో నందమూరి కుటుంబంలో చంద్రబాబంటే పడనివారి చూపు బీజేపీ కాంగ్రెస్ కంటే వైసీపీనే బెటర్ అట.. గతంలోనే ఎన్టీఆర్ రెండవ భార్య లక్ష్మీపార్వతి వైసీపీలో చేరారు. అదే నందమూరి కుటుంబం నుంచి వచ్చిన దగ్గుబాటి పురందేశ్వరికి కూడా చంద్రబాబంటే ఎంతో కోపం.. ఆయనతో పడకనే ఆమె మొదట కాంగ్రెస్ లో చేరి అక్కడినుంచి బీజేపీలో చేరారు. ఇప్పుడు కొడుకు పంతంతో వైసీపీలోకి రావాలంటుకుంటున్నారట.. పురందేశ్వరికి మళ్ళీ ఎంపీగా పోటీచేసి లోక్ సభకు వెళ్ళాలని కోరిక ఉండడంతో బీజేపీలో ఆమెకు సీటు ఖాయమైనా గెలుపు డౌట్ గా ఉండడంతో జగన్ కనుక ఆహ్వానిస్తే విజయవాడ పార్లమెంట్ నుంచి పోటీకు ఆమె రెడీగా ఉన్నారట.

మరో వైపు వైసీపీకి కూడా సరైన క్యాండిడేట్ ఇక్కడ లేకపోవడంతో అన్న నందమూరి సొంత జిల్లాలో ఆయన కుమార్తె పోటీ చేస్తే అది తమకు ప్లస్ అవుతుందని కూడా వైసీపీ భావిస్తోందట.. మరోవైపు హితైష్ తండ్రి వెంకటేశ్వరరావు ప్రాతినిధ్యం వహించిన పరుచూరు నుంచి ఎమ్మెల్యేగా రంగంలోకి దించాలనుకుంటున్నారట.. మరి జగన్ ఈ రెండు ప్రతిపాదనలకూ ఒకే చెబుతారు అనేది పార్టీ వర్గాల అభిప్రాయం.. కారణం నందమూరి కుటుంబం నుంచి రావడం రెండోది వారు ఆశిస్తున్న స్థానాల్లో వైసీపీకి అంత ఇబ్బంది. గతంలో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకున్న చంద్ర‌బాబు, ఆ స‌మ‌యంలో త‌న వెన్నంటే ఉన్న ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావును ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ఆయ‌న తప్పక కాంగ్రెస్‌లో చేరిపోయారు. అయితే కొన్నాళ్ళుగా వెంక‌టేశ్వ‌ర‌రావు యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్నారు.

దీంతో ఆలోచ‌న‌లో ప‌డ్డ ద‌గ్గుబాటి కుటుంబం ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీలో ఎలాగూ చేరే ప‌రిస్థితి లేదు కాబట్టి ఇక్కడ వైసీపీకే అనుకూల ప‌వ‌నాలు వీస్తున్నాయి. ఈ క్ర‌మంలో ద‌గ్గుబాటి ఫ్యామిలీ వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నార‌ట.. ఇప్ప‌టికే వైసీపీ ముఖ్య నేత‌ల‌తో చ‌ర్చ‌లు పూర్తి అయ్యాయ‌ని, ఈ క్ర‌మంలో పురంధేశ్వ‌రితో పాటు ద‌గ్గుబాటి హితేశ్‌ను కూడా బ‌రిలోకి దించాల‌నే ప్ర‌తిపాద‌న‌ను వైసీపీ ముఖ్య‌నేత‌ల ముందు ఉంచ‌గా.. జ‌గ‌న్‌తో చ‌ర్చించిని త‌ర్వాత ద‌గ్గుబాటి వారి ప్ర‌తిపాద‌న‌కు ఓకే చెప్తాం అన్నట్టు తెలుస్తోంది. అయితే వీరి కుటుంబం వైసీపీలోకి వస్తే వెంకటేశ్వరరావు కళ్లకు కట్టినట్టు వెన్నుపోటు ఘటనలు ప్రజలకు వివరిస్తే సీన్ ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్న నందమూరి కుటుంబంలో కేవలం బాలకృష్ణ తప్ప మిగతావారంతా వైసీపీలో కొనసాగితే టీడీపీకి మెజార్టీ స్థానాల్లో డిపాజిట్లు కూడా దక్కవు.. టీడీపీ కాంగ్రెస్ అనైతిక పొత్తు కూడా ఇందుకు మరింత ఊతమిస్తోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat