సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేల చంద్రబాబుకు దెబ్బ మీద దెబ్బ పడుతుంది.ఒకపక్క జగన్ పాదయాత్ర దెబ్బకు బాబు మైండ్ బ్లాక్ అయ్యింది.ఇప్పటి వరకు జన్మభూమి, శంకుస్థాపనల మీద దృష్టి పెట్టిన బాబు పండుగ తర్వాత పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టనున్నారు. ఎన్నికల సమయం కాబట్టి అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టారు.
అసెంబ్లీ సీట్లు పెరగకపోవడం,ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను నమ్ముకుంటే లాభం లేదని మరో కొత్త రాజకీయం మొదలెట్టారు.ఎన్నికలకు ముందు ఇతర పార్టీల కీలక నేతలు టీడీపీలో చేరితే పార్టీకి లాభిస్తుందని ఆ నేతలపై దృష్టి సారించారని తెలుస్తుంది.పెద్ద నాయకులు సైకిల్ పై మగ్గు చూపితే వారిని ఆహ్వానించేందుకు చంద్రబాబు కూడా సిద్ధంగా ఉన్నారట.
గతంలో వేర్వేరు పార్టీల్లో కీలకంగా ఉండి ఇప్పుడు దూరంగా ఉన్ననేతల పై,ముఖ్యంగా వైసీపీకీ రాజీనాలు చేసిన నేతలను టార్గెట్ చేశారు సీఎం చంద్రబాబు.వీలైనంత వరకు వాళ్ళు త్వరలోనే టీడీపీలో చేరడం ఖాయమనే ప్రచారం కూడా జరుగుతోంది.సాధ్యమైనంత త్వరగా నేతలను పార్టీలో చేర్చుకోవాలనే ఆలోచనలో బాబు ఉన్నట్లు పార్టీ వర్గాలు నుంచి వస్తున్న సమాచారం.