రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మేరెడ్డి సత్యనారాయణ రెడ్డి, జానకమ్మదంపతులు తమ గొప్ప మనసు చాటుకున్నారు.వారికున్న వృద్ధాశ్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తునట్లు వెల్లడించారు.వివరాల్లోకి వెళ్తే..యాదాద్రి భువనగిరి జిల్లా..చౌటుప్పల్ మండలం పెద్ద కొండూరు గ్రామంలో కోటి రూపాయలతో మేరెడ్డి సత్యనారాయణ రెడ్డి, జానకమ్మదంపతులు వృద్ధాశ్రమాన్ని నిర్మించారు.ఇవాళ తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను వారు కలిసి ఆ వృద్ధాశ్రమ వివరాలను అందించారు. ఎకరంన్నర భూమిలో, ఆరు వేల చదరపు అడుగుల భవనాన్ని సొంత ఖర్చులతో నిర్మించామని, అనారోగ్యం వల్ల భవనంతో పాటు పూర్తి ఆశ్రమాన్ని ప్రభుత్వపరం చేస్తామని, అక్కడి వృద్ధులకు సేవలు కొనసాగేలా చూడాలని కేటీఆర్ ని వారు కోరారు. ఆ దంపతుల సేవా దృక్పథాన్ని, దాతృత్వాన్ని కేటీఆర్ కొనియాడారు.ప్రభుత్వ అధికారులతో మాట్లాడి వృద్ధాశ్రమం కొనసాగేలా సహకారం అందిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
