వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చాపురం పాత బస్టాండ్ బహిరంగ సభ ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసగించారు. లక్షలాది మందితో సభాస్థలి కిక్కిరిసింది. జై జగన్ నినాదాలతో ఆ ప్రాతమంతా మారుమోగుతోంది. చరిత్రాత్మక ప్రజాసంకల్పయాత్ర ముగిసిన సందర్భంగా ఇచ్ఛాపురం పాత బస్టాండ్ వద్ద బహిరంగ సభలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇడుపులపాయలోని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి స్మృతివనం (వైఎస్సార్ ఘాట్) నుంచి 2017 నవంబర్ 6వ తేదీన జననేత చేపట్టిన ‘ప్రజా సంకల్పయాత్ర’, శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగిసింది. మొత్తం 341 రోజుల పాటు సాగిన ప్రజాసంకల్పయాత్ర.. 134 నియోజకవరాగలు, 231 మండలాలు, 2,516 గ్రామాలు, 54 మున్సిపాలిటీలు, 8 కార్పొరేషన్ల గుండా సాగింది. జగన్ 55 ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు. ఇప్పటివరకు 123 సభల్లో పాల్గొన్న వైఎస్ జగన్.. పాదయాత్రలో అఖరి బహిరంగ సభలో ఏం ప్రసంగించారంటే
పాదయాత్రలో ఎంతమందిని కలిశాం.. ఎంతమందికి భరోసా ఇచ్చామన్నదే ముఖ్యం
నాలుగున్నరేళ్లలో బాబు పాలన ఎంత ఘోరంగా ఉందో ప్రజలు చెప్పారు.
కరువు, నిరుద్యోగం వీటికి తోడు చంద్రబాబు మోసం ప్రజల పాలిట శాపంగా మారింది.
ప్రజాసంకల్పయాత్రలో ప్రజల గుండె చప్పుడు విన్నాను.
ప్రజల గుండె చప్పుడును నా గుండె చప్పుడుగా మార్చుకున్నాను.
14 నెలలుగా 3648 కిలోమీటర్లు నేను నడిచినా.. నడిపించింది ప్రజలు.. పైనున్న దేవుడు అని జగన్ ఇచ్చాపురం పాత బస్టాండ్ బహిరంగ సభలో అన్నారు
Tags ఇచ్చాపురం పాదయాత్ర వైఎస్ జగన్ వైసీపీ