ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ముగింపు సందర్భంగా అనంతపురం జిల్లా ఉరవకొండలో వైసీపీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.ఉరవకొండ రాజకీయ చరిత్రలోనే అతిపెద్ద బైక్ ర్యాలీగా చెప్పుకుంటున్న ఈర్యాలీని ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి పార్టీ జెండా ఊపి ప్రారంభించారు.ఎమ్మెల్యే తనయుడు వైసీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి ప్రణయ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది.ఈ సందర్భంగా టవర్ క్లాక్ వద్ద జరిగిన సభలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కొనసాగుతున్న ,దుర్మార్గపు, అధర్మపు పరిపాలనపై సమర శంఖారావమే జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర అని అన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రకు ప్రజల నుండి విశేష స్పందన వచ్చిందన్నారు. 3 వేల 600 కిలోమీటర్ల మైలు రాయిని దాటిన ప్రజాసంకల్పయాత్రకు మద్దతుగా వైసీపీ మ్యానిఫెస్టోలోని నవరత్నాల ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రాధాన్యత వివరిస్తామన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు.
